Jump to content

భారతమాత దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 25°19′02″N 82°59′21″E / 25.317209°N 82.989291°E / 25.317209; 82.989291
వికీపీడియా నుండి
భారతమాత దేవాలయం
भारत माता मंदिर
భారతమాత దేవాలయం is located in Uttar Pradesh
భారతమాత దేవాలయం
ఉత్తరప్రదేశ్ పటంలో ఆలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు25°19′02″N 82°59′21″E / 25.317209°N 82.989291°E / 25.317209; 82.989291
దేశం Indiaభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
ప్రదేశంమహాత్మాగాంధీ విద్యాపీఠం, వారణాసి
ఎత్తు83.67 మీ. (275 అ.)
సంస్కృతి
దైవంభారతమాత
ముఖ్యమైన పర్వాలుస్వాతంత్ర్య దినోత్సవం
గణతంత్ర దినోత్సవం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1936
సృష్టికర్తశివప్రసాద్ గుప్త

భారతమాత దేవాలయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా, ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన అఖండ భారతదేశ భారీ శిల్పం ఉంది. ఈ దేవాలయంలోని ప్రధాన ఆరాధ్య దైవం భారత మాత కాబట్టి దీన్ని భారత మాతకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని భారత మాతకు చెందిన దేవాలయాలలో ఇదే మొట్టమొదటిది.[1][2][3][4]

చరిత్ర

[మార్చు]

1936లో స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ శివప్రసాద్ గుప్తా చేత నిర్మించబడిన భారత మాతా మందిరాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించాడు. ఈ ఆలయం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో నిర్మించబడింది.[1][2]

నిర్మాణం

[మార్చు]

భారత మాత మందిరం రాతితో నిర్మించబడింది. ఇది అవిభాజ్య భారతదేశానికి ప్రతీకగా పాలరాతితో నిర్మించిన భారత మాత విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన భారతదేశం రిలీఫ్ మ్యాప్ కూడా ఉంది. మ్యాప్ లో పర్వతాలు, మైదానాలు, మహాసముద్రాలు గుర్తించబడ్డాయి.[5]

వివిధ ప్రదేశాల నుండి దూరం

[మార్చు]

భారత మాత మందిరం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ఆవరణలో ఉంది. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా 1.5 కిలోమీటర్ల దూరంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి సమీపంలో ఈ భారత మాత ఆలయం ఉంది.[6]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Bharat Mata Mandir". varanasi.org. Archived from the original on 23 సెప్టెంబర్ 2014. Retrieved 3 March 2015. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. 2.0 2.1 "Bharat Mata". varanasicity.com. Retrieved 3 March 2015.
  3. "LP". Lonely Planet. Retrieved 3 March 2015.
  4. "Temple news". The Times of India. Retrieved 3 March 2015.
  5. Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 11. ISBN 978-81-87952-12-1.
  6. "Location". Google Maps. Retrieved 3 March 2015.