భీముని పాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భీముని జలపాతం, సహజసిద్ధంగా ఏర్పడింది.మహబూబాబాదు జిల్లా, గూడూరు మండలం, కొమ్ములవంచ పరిధి అటవీప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్యన నిరంతర జలధారలతో అలరిస్తున్న భీమునిపాదం జలపాతానికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంతుపట్టని రహస్యంగానే ఉంది. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార పర్యాటకుల్ని ఉల్లాసపరుస్తుంది. ఇక్కడ పాండవులు వనవాసానికి వచ్చిన సమయంలో భీముని మూలంగా నీరు ఊరిందని.. జలపాతం పైభాగంలో భీముని పాదముద్ర ఉందని స్థానికుల నమ్మకం. [1]


ప్రదేశం[మార్చు]

భీమునిపాదం వరంగల్ పట్టణానికి 51 కిలోమీటర్ల దూరంలో గూడూరు నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్.. సీతానాగారం.. కొమ్ములవంచ మీదుగా వెళ్లొచ్చు. గూడూరు నుంచి వెళ్లాలనుకునే వాళ్లు గూడూరు.. చంద్రుగూడెం.. లైన్‌తండా.. వంపుతండాల మీదుగా భీమునిపాదానికి చేరుకోవచ్చు. కొత్తగూడెం నుంచి వెళ్లాలనుకునేవాళ్లు కోలారం.. బత్తులపల్లి.. గోపాలపురం మీదుగా భీమునిపట్నం చేరుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. భీముని పాదం. "తెలంగాణ నయాగరాలు". నమస్తే తెలంగాణ. Archived from the original on 10 జూలై 2017. Retrieved 9 September 2017.

వెలుపలి లంకెలు[మార్చు]