భోగరాజు నారాయణమూర్తి
స్వరూపం
(భోగరాజు నారాయణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)
భోగరాజు నారాయణమూర్తి | |
---|---|
జననం | దేవుపల్లి | 1891 అక్టోబరు 8
మరణం | 1940 ఏప్రిల్ 12 | (వయసు 48)
వృత్తి | తెలుగు నవలాకారుడు, నాటక కర్త |
తల్లిదండ్రులు |
|
భోగరాజు నారాయణమూర్తి (అక్టోబర్ 8, 1891 - ఏప్రిల్ 12, 1940) ప్రముఖ నవలా రచయిత, నాటక కర్త.
జననం
[మార్చు]ఈయన 1891, అక్టోబర్ 8 న గజపతినగరం, బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు బాల ప్రసాదరావు, జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- విమలాదేవి (1915)
- ఆంధ్ర రాష్ట్రము (1918)[1]
- అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల
- ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల
- ప్రచండ పాండవము
- చంద్రగుప్త
- కాలచక్రము (1949):[2] సమకాలీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవల
- అల్లాహో అక్బర్ : కాకతీయులకు, మహమ్మదీయులకు మధ్యగల మతరాజకీయాలను వివరించే నవల.
- ఉషఃకాలము : శివాజీ జీవితం ఇతివృత్తంగా సాగిన నవల
- పండుగ కట్నము (1927)
పద్య కావ్యాలు
[మార్చు]- కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ[3]
- కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవిత చరిత్ర
- వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం
- ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ
- పార్థివలింగ శతకము
నాటకాలు
[మార్చు]మరణం
[మార్చు]1940, ఏప్రిల్ 10 న పరమపదించాడు.
మూలాలు
[మార్చు]- ↑ https://books.google.co.in/books?id=sqBjpV9OzcsC&pg=PA532&lpg=PA532&dq=bhogaraju+narayanamurthi&source=bl&ots=Db6dF2ifLn&sig=4nEVEzv8JrczMhv-gEnSpyavsws&hl=te&sa=X&ved=0ahUKEwjbh96T9O7WAhXJuY8KHYMnCTkQ6AEIWzAI#v=onepage&q=bhogaraju%20narayanamurthi&f=false
- ↑ https://archive.org/details/in.ernet.dli.2015.497375/mode/2up
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో లక్షణ పుస్తక ప్రతి.