మంగళసూత్రం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మంగళసూత్రం - ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే, ఈ సూత్రం ధరించినందువల్ల మానవ జీవితములో అనేక మంగళములు కలుగుతున్నాయి కనక ఈ సూత్రానికి మంగళసూత్రానికి అంటే ఒక సాధారణంగా కనిపించే మామూలు తాడుకు పసుపు పూసి కట్టిన తాడు కు మంగళసూత్రం అని పేరు వచ్చింది. స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక కుటుంబంగా జీవించడానికి ఇష్టపడి ఈ సూత్రముని ధరించడానికి స్త్రీ దానిని ధరింప చెయ్యడానికి పురుషుడు అంగీకరించి వివాహము ( విశేషమైన వాహము అంటే విశేషమైన జీవన విధానమునకు విశేషమైన జీవనానికి ఆధారము అవుతున్నది కనక ఇది వివాహము అవుతోంది. మనిషి జీవితంలో ఈ సూత్రం ధరించి ఆ మంగళములను పొందుతున్నారు కనక మంగళ సూత్రం అని పేరు వచ్చింది. ఇక ఈ సూత్రం వల్ల మనుషులకు ఎలాంటి మంగళములు కలుగుతాయి? అనేది అత్యుత్తమైన అసలైన తార్కికమైన ప్రశ్న. అనేక మంది వివాహాన్ని వ్యతిరేకించే వారున్నారు. ఇది ప్రకృతిలోనే అసహజమైన విధానమని వాదించే వారూ వున్నారు. హిందూ వివాహ విధానం లో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్య ధారణ చేసే ముందు వారిద్దరూ కలిసి అగ్ని సాక్షిగా ఎన్నో ప్రతిజ్ఞలు చేసి మాంగల్యం మాంగల్యాన్ని స్త్రీ ధరించితే పురుషుడు ఆమె మెడలో కట్టి ధరింప చేస్తాడు. పురుషుడికి వివాహం జరిగినదానికి అతని కి ఉంగరాన్ని కట్టి ఆతను వివాహ దీక్షను తీసుకున్న వాడు అని తెలియచేస్తారు. ఈ పసుపు తాడు ఆధారంగా వైవాహిక జీవితాన్ని ఆరంభిస్తారుకనక అది మంగళ సూత్రం అవుతున్నది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత నుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరించును. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.
చరిత్ర
[మార్చు]పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, ధగ్గులు వంటి కిరాత జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. పురుషులు శత్రువులతో పోరాడి తమ స్త్రీలను విడిపించుకొనేవారు. కాలక్రమేణా తమ స్త్రీలకు తాయెత్తులాంటివి లేదా త్రాడులాంటివి కట్టసాగారు. కాల క్రమేణా అది మెడలో వేయసాగారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు. ఆ విధంగా సమాజంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి అను పుస్తకములో మంగళ సూత్రానికి విశిష్టత కల్పించారు. కొన్ని కులాల్లో పురుషులు కూడా వివాహ స్థితిని తెలియజెప్పడానికి చుట్టువుంగరం పెట్టుకుంటారు. హా
మంగళసూత్రంలో పగడం, ముత్యం ప్రాముఖ్యత
[మార్చు]మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు?
ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు
అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
కుజగ్రహ కారకత్వము: అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు, శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొ!!
ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే..
ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయింది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయని కొన్ని సంప్రదాయాల వారు విశ్వసిస్తారు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభఫలితాలు సమకూర్చగలవు.
మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే