Jump to content

మద్దులూరు (సంతనూతలపాడు)

అక్షాంశ రేఖాంశాలు: 15°27′36.000″N 79°52′1.200″E / 15.46000000°N 79.86700000°E / 15.46000000; 79.86700000
వికీపీడియా నుండి
మద్దులూరు (సంతనూతలపాడు)
గ్రామం
పటం
మద్దులూరు (సంతనూతలపాడు) is located in ఆంధ్రప్రదేశ్
మద్దులూరు (సంతనూతలపాడు)
మద్దులూరు (సంతనూతలపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°27′36.000″N 79°52′1.200″E / 15.46000000°N 79.86700000°E / 15.46000000; 79.86700000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంసంతనూతలపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523225


మద్దులూరు , ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సమీప గ్రామాలు

[మార్చు]

బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, ఎనికపాడు, గుమ్మలంపాడు, పెదతలపూడి

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఆదర్శ కాలనీ:- ఈ పాఠశాల ఆరవ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-9వ తేదీనాడు నిర్వహించారు.

మౌలిక వసతులు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]
  • ఈ గ్రామంలో, 2013లో 40 లక్షల రూపాయలతో, ఒక త్రాగునీటి ట్యాంకునూ, పైపులనూ ఏర్పాటు చేసి, తద్వారా గ్రామస్తులకు త్రాగునీరు అందించుచున్నారు.
  • ఈ గ్రామంలోని ప్రవాస భారతీయులు అందరూ కలిసి, స్నేహిత సేవా సమితి గా ఏర్పడి, సుమారుగా ఏడు లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో ఒక శుద్ధినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాన్ని 2016 మే 22న ప్రారంభించారు.

సౌర విద్యుద్దీపాలు

[మార్చు]

ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా 33 సౌర విద్యుద్దీపాలను (వీధిదీపాలను) ఏర్పాటు చేయబోవుచున్నారు. వీటికి అయ్యే వ్యయంలో 20% మొత్తాన్ని (రు. 1,20,000) గ్రామస్థుల/పంచాయతీ వాటాగా చెల్లించవలసి యుండగా, ఈ వ్యయాన్ని, గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన "స్ఫూర్తి సేవ సంస్థ" వారు ఒక లక్ష రూపాయలను వితరణ చేయగా, ఉప సర్పంచి దాసరి రవిబాబు, రు. 20,000 అందజేసారు. మిగతా వ్యయాన్ని వాటర్ షెడ్ పథకం క్రింద ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. ఒక్కో దీపానికి రు. 18,000-00, వాటర్ షెడ్ పథకం నుండి అందజేయుచున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2014, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, నువ్వల మీరయ్య, ఎంపీటీసీగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ అనేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని, 2015,డిసెంబరు-7వ తేదీ కార్తీక మాసం (నాల్గవ, అఖరి) సోమవారంనాడు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా వేప, రావి చెట్లకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం వనభోజన కార్యక్రమం నిర్వహించారు.
  • శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయానికి 8.88 ఎకరాల మాన్యం భూమి ఉంది.
  • శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయ సప్తమ వార్షిక ఉత్సవాలు, 2015, మేనెల-22వతేదీ శుక్రవారంనాడు, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివారల కళ్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ గావించారు.
  • శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయ ఆవరణలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి జలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

నన్నూరి వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచి.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో మేకా నాగమణి అను ఒక క్రీడాకారిణి ఉన్నారు. ఈమె లక్నో నగరంలో 2016,మే-9న నిర్వహించు జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనుటకు ఎంపికైంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]