మధు బంగారప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధు బంగారప్ప
మధు బంగారప్ప


రాష్ట్ర ప్రాథమిక, సెకెండరీ విద్య శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
ముందు బి. సి. నగేష్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు కుమార్ బంగారప్ప
నియోజకవర్గం సొరబ్
పదవీ కాలం
2013 – 2018[1]
ముందు హెచ్. హాలప్ప
తరువాత కుమార్ బంగారప్ప
నియోజకవర్గం సొరబ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
(జులై 2021 నుండి - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (సెక్యూలర్)
(జులై 2021 వరకు)
తల్లిదండ్రులు ఎస్. బంగారప్ప, శకుంతల
జీవిత భాగస్వామి అనిత మధు
బంధువులు కుమార్ బంగారప్ప (సోదరుడు)
శివ రాజ్‌కుమార్ (బావ)
వృత్తి సినీ నిర్మాత, నటుడు, రాజకీయ నాయకుడు

మధు బంగారప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సొరబ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర ప్రైమరీ & సెకండరీ విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మధు బంగారప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారుడు. అతనికి అన్నయ్య కుమార్ బంగారప్ప & ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అందులో ఒకరు నటుడు శివరాజ్‌కుమార్‌ భార్య గీతా శివరాజ్‌కుమార్‌.

రాజకీయ జీవితం[మార్చు]

మధు బంగారప్ప 2013లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థిగా సొరబ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో షిమోగా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] మధు బంగారప్ప 2023లో కర్ణాటక శాసనసభకు సొరబ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర ప్రైమరీ & సెకండరీ విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4]

సినీ జీవితం[మార్చు]

సంవత్సరం సినిమా ఇతర విషయాలు
1989 శరవేగద శారదరా కార్యనిర్వాహక నిర్మత
1990 అశ్వమేధ కార్యనిర్వాహక నిర్మత
1992 పురుషోత్తమ నిర్మాత
1992 బెల్లియప్ప బంగారప్ప నిర్మాత
1994 గండుగలి నటుడు
1995 థాయీ ఇల్లడ తవరు ప్రెజెంటర్
1996 ఆదిత్య నటుడు
2003 గోకర్ణ నటుడు
2006 కల్లరాలి హూవాగి నిర్మాత

మూలాలు[మార్చు]

  1. "Sitting and previous MLAs from Sorab Assembly Constituency". elections.in. Retrieved 31 Jul 2021.
  2. Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  3. The Hindu (30 July 2021). "Madhu Bangarappa joins Congress" (in Indian English). Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.
  4. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.