మనోజ్ రజోరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. మనోజ్ రజోరియా
మనోజ్ రజోరియా


పదవీ కాలం
సెప్టెంబర్ 2014 – మే 2024
ముందు ఖిలాడీ లాల్ బైర్వా
నియోజకవర్గం కరౌలి - ధౌల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-12-19) 1969 డిసెంబరు 19 (వయసు 54)
జైపూర్, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సునీతా రాజోరియా
సంతానం 2
నివాసం 320, ఠాగూర్ నగర్, అజ్మీర్ రోడ్, జైపూర్, రాజస్థాన్
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు
మూలం [1]

డాక్టర్ మనోజ్ రజోరియా (జననం 19 డిసెంబర్ 1969 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో రాజస్థాన్‌లోని కరౌలి ధోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మనోజ్ రజోరియా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరౌలి ధోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లఖీరామ్ లాల్‌పై 27,216 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1 సెప్టెంబర్ 2014 నుండి 31 ఆగస్టు 2018 వరకు పార్లమెంట్‌లో ఆరోగ్య & కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీలో, 1 సెప్టెంబర్ 2018 నుండి 25 మే 2019 వరకు పర్యాటక & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీలో, శక్తిపై స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

మనోజ్ రజోరియా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరౌలి - ధౌల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ జాతవ్ పై 97,682 ఓట్లు మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత పార్లమెంట్‌లో 13 సెప్టెంబర్ 2019 నుండి 3 నవంబర్ 2019 వరకు సామాజిక న్యాయం & సాధికారతపై స్టాండింగ్ కమిటీలో, 4 నవంబర్ 2019 నుండి 12 సెప్టెంబర్ 2020 వరకు రసాయన & ఎరువులపై స్టాండింగ్ కమిటీలో, 13 సెప్టెంబర్ 2020 నుండి వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీలో, 31 అక్టోబర్ 2019 నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

మనోజ్ రజోరియా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు సామజిక కారణాలతో బీజేపీ టికెట్ దక్కలేదు.[3]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (18 April 2019). "Karauli-Dholpur Lok Sabha constituency". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. The Indian Express (2024). "Manoj Rajoria". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  3. Zee News. "Lok Sabha Election 2024: धौलपुर सीट पर मनोज राजोरिया को टिकट नहीं देकर बीजेपी ने कर दी गलती?". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.