మన్నె క్రిశాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్నె క్రిశాంక్‌
మన్నె క్రిశాంక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 డిసెంబర్ 2021 నుండి ప్రస్తుతం
ముందు శేరి సుభాష్‌రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1985
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి సుహాసిని
సంతానం 1
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు
29, డిసెంబర్ 2021నాటికి

మన్నె క్రిశాంక్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 15 డిసెంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుడై,[1] 29 డిసెంబర్ 2021న భాద్యతలు చేపట్టాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

మన్నే క్రిశాంక్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పని చేశాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి, చివరి నిమిషంలో వేరే అభ్యర్ధికి పార్టీ బీఫారం ఇచ్చింది. క్రిశాంక్ పార్టీ టికెట్ దక్కకపోయిన నిరాశపడకుండా ప్రజా సమస్యలపై పోరాడటం చేయడంతో ఆయనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించింది. ఆయన 2018 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. క్రిశాంక్ దింతో మనస్థాపం చెంది మార్చి 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

మన్నే క్రిశాంక్ ను తరువాత టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమించింది. ఆయన కన్వీనర్‌గా పార్టీ సభ్యులు, కమిటీల డేటా బేస్, పార్టీ వెబ్‌సైట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ తదితరాల నిర్వహణతోపాటు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వ్యాప్తి ప్రజలకు చేరవేయడంలో విశేషంగా కృషి చేశాడు.

మన్నె క్రిశాంక్‌ 15 డిసెంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుడై,[3] 29 డిసెంబర్ 2021న చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[4][5]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (15 December 2021). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  2. Sakshi (30 December 2021). "కార్పొరేషన్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  3. Eenadu (17 December 2021). "మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  4. TNews Telugu (29 December 2021). "ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన క్రిశాంక్, నగేష్". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
  5. Eenadu (30 December 2021). "మూడు కార్పొరేషన్ల కొత్త ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.