మయన్మార్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్మా హిందువులు
ద్రావిడ శైలిలో నిర్మించిన కాళికాలయం, యాంగాన్.
మొత్తం జనాభా
8,90,000 (2021)
మతాలు
హిందూమతం
భాషలు
పూజల్లో
సంస్కృతం, తమిళం
మాట్లాడే భాషలు
తమిళం, బర్మీస్, ఇంగ్లీషు
Related ethnic groups
తమిళులు, బెంగాలీ హిందువులు,హిందూ రోహింగ్యాలు

మయన్మార్ జనాభాలో 1.7% మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నారు. వీరి సంఖ్య దాదాపు 8,90,000 ఉంటుంది. [1][2] ఇది బౌద్ధమతం లోని అంశాలచేత ప్రభావితమైంది. మయన్మార్‌ లోని అనేక హిందూ దేవాలయాలలో బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. [3][4] దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నారు. ఇందులో మయన్మార్ తమిళులు, మైనారిటీ బెంగాలీ హిందువులకు అత్యధిక వాటా ఉంది.

చరిత్ర[మార్చు]

హిందూమతం, పురాతన కాలం లోనే బౌద్ధమతంతో పాటు బర్మాకు చేరుకుంది. ఆ దేశపు రెండు పేర్లు హిందూమతంలో పాతుకుపోయాయి; బర్మా అనేది ఈ ప్రాంతపు ప్రాచీన నామమైన "బ్రహ్మ దేశం" లోని మొదటి అర్ధభాగానికి నోరు తిరగని బ్రిటిషు వారు పెట్టిన పేరు. హిందూ త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు నాలుగు తలలుంటాయి. మయన్మార్ అనే పేరు బ్రహ్మ యొక్క ప్రాంతీయ భాషా లిప్యంతరీకరణ . ఇక్కడ బ కార, మ కారాలు పరస్పర ప్రత్యామ్నాయాలు.[5]

అరకాన్ (రఖైన్) యోమా అనేది బర్మా, భారతదేశాల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన సహజ పర్వత అవరోధం. దక్షిణాసియా సముద్రపు వ్యాపారుల ద్వారా హిందూమతం, బౌద్ధమతాలు మణిపూర్ గుండా బర్మాలోకి చేరుకున్నాయి. బగాన్ వంటి నగరాల వాస్తుశిల్పంలో చూసినట్లుగా, హిందూమతం వలసరాజ్యాల పూర్వ కాలంలో బర్మా రాజుల సభను బాగా ప్రభావితం చేసింది. అదేవిధంగా, బర్మా భాష సంస్కృతం, పాళీల నుండి అనేక పదాలను స్వీకరించింది. వాటిలో చాలావరకు మతానికి సంబంధించినవి.[6]

బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, నే విన్ ఆధ్వర్యంలోని బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ విదేశీయుల పట్ల హింసాత్మక విధానాలను అవలంబించింది. 1963 - 1967 మధ్య బర్మా నుండి 1,00,000 మంది చైనీయులతో పాటు 3,00,000 మంది భారతీయ జాతి ప్రజలను (వీరిలో చాలా మంది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు) బహిష్కరించారు.

జనాభా వివరాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
18911,71,432—    
19012,85,484+66.5%
19113,89,679+36.5%
19214,84,432+24.3%
19315,70,953+17.9%
19731,15,685−79.7%
19831,77,215+53.2%
20142,52,763+42.6%

బర్మా జనగణన డేటా హిందూ మతాన్ని పేర్కొన్న వ్యక్తులను మాత్రమే పరిగణిస్తుంది. ప్యూ రీసెర్చ్ 2010లో 8,20,000 నుండి 8,40,000 మంది హిందువు లుంటారని అంచనా వేసింది. [7]

రాష్ట్రం/ప్రాంతం వారీగా జనాభా[మార్చు]

2014 జనగణన ప్రకారం రాష్ట్రం/ప్రాంతం వారీగా హీందువ్ల జనాభా కింది విధంగా ఉంది.[8]

రాష్ట్రం/ప్రాంతం హిందువుల శాతం
 Bago 2%
 Mon 1%
 Yangon 1%
 Kayin 0.6%
 Rakhine 0.5%
 Kachin State 0.4%
 Tanintharyi 0.2%
 Mandalay 0.2%
 Kayah 0.1%
 Magway 0.1%
 Sagaing 0.1%
 Ayeyarwady Region 0.1%

జాతి[మార్చు]

బొట్టు పెట్టుకున్న బర్మీస్-తమిళ హిందూ స్త్రీ. ఇది బర్మీస్ జాతి జనులు పెట్టుకునే థానాఖాను పోలి ఉంటుంది.

మయన్మార్ హిందువుల జనాభాలో ప్రధానంగా బర్మీస్ భారతీయులు ఉన్నారు. బర్మీస్ భారతీయులలో హిందూమత ఆచారం కూడా బౌద్ధమతంచే ప్రభావితమైంది. హిందూ దేవతలతో పాటు, బుద్ధుడిని కూడా పూజిస్తారు. మయన్మార్‌లోని అనేక హిందూ దేవాలయాలలో బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. బర్మీస్ భారతీయులలో మయన్మార్ తమిళులు, బెంగాలీలు, ఒడియాలు మొదలైనవారు ఉన్నారు.

మయన్మార్‌లోని మెయిటీ (లేదా మణిపురి)లో ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. వారు 1819 నుండి 1825 వరకు మణిపురి-బర్మీస్ యుద్ధంలో మణిపూర్ నుండి బలవంతంగా తీసుకెళ్లబడిన కార్మికుల వారసులు. మణిపురీలు మాండలే, సాగింగ్, అమరాపుర ప్రాంతాలలో దాదాపు 13 గ్రామాలలో కేంద్రీకృతమై ఉన్నారు. మణిపురి స్థావరాలు నింగ్తి నది వెంబడి కూడా కనిపిస్తాయి. అలాగే నది, మణిపూర్ సరిహద్దు మధ్య ఉన్న ప్రాంతాల్లో కూడా మణిపురి స్థావరాలు ఉన్నాయి.

మయన్మార్‌లో నేపాలీ- మాట్లాడే బర్మీస్ గూర్ఖాలు కూడా చాలామంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. బర్మీస్ గూర్ఖాలు వలసరాజ్యాల కాలంలో బ్రిటిష్ సైన్యంతో పాటు వచ్చారు. దేశంలో అంతటా బర్మీస్ గూర్ఖాలు నిర్మించిన సుమారు 250 హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్క మొగోక్ నగరంలోని మాండలే ప్రాంతం లోనే 30 దేవాలయాలు ఉన్నాయి. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన మూడు నుండి ఐదు ఆలయాలు ఉన్నాయి. బెంగాలీ హిందువులలో ఒక చిన్న మైనారిటీ కూడా హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు.

1983 జనాభా లెక్కల్లో చివరిగా జాతి డేటా సేకరించారు. ఆ తర్వాత జాతికి సంబంధించిన గణాంకాలను జనాభా గణన విభాగం ప్రచురించలేదు. 1983లో 4,28,428 మంది భారతీయులు, 42,140 మంది పాకిస్థానీలు, 567,985 మంది రోహింగ్యాలు, 28,506 మంది నేపాలీలు ఉన్నారు. [9] మతపరమైన సంప్రదాయాలలో పరస్పర అతివ్యాప్తి కారణంగా, 1983 జనాభా లెక్కల సమయంలో ఈ జాతులలో కొందరు హిందువులు బౌద్ధులుగా నివేదించబడే అవకాశం ఉంది. 1983లో (1,77,215) హిందువుల సంఖ్య తక్కువగా ఉండడానికి దీన్ని కారణంగా చెప్పవచ్చు.

1983 సెన్సస్ నివేదిక ప్రకారం, జాతి భారతీయులలో 27.10% మంది తమను తాము బౌద్ధులుగా, 33.64% మంది హిందువులుగా, 32.71% మంది ముస్లింలుగా, 4.44% మంది క్రైస్తవులుగా, 2.10% మంది ఇతరులుగా ప్రకటించుకున్నారు. బర్మీస్ జాతిలో, జనాభా లెక్కల ప్రకారం హిందువులు మూడు వేల మంది ఉన్నారు. 1983లో నివేదించబడిన 1,74,401 మంది హిందువులలో, జాతి ఈ క్రింది విధంగా ఉంది: భారతీయులు - 1,43,545, చైనీస్ - 43, మిశ్రమ జాతి - 4,882, పాకిస్థానీ - 567, బంగ్లాదేశ్ - 865, నేపాలీ - 17,410, ఇతర విదేశీయులు - 674, కయాచ్ - 674 - 3, కరెన్ - 55, చిన్ - 155, బర్మీస్ - 2,988, సోమ - 27, రఖైన్ - 99, షాన్ - 69, ఇతర దేశీయులు - 2,966. [10]

సమకాలీన స్థితి[మార్చు]

మయన్మార్‌లోని యాంగాన్‌లో హిందూ దేవాలయ ఊరేగింపు .

మెజారిటీ బౌద్ధ సంస్కృతిలో కూడా హిందూమత అంశాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, హిందూ దేవుడు ఇంద్రుడి మూలాలున్న థాగ్యమిన్‌ను ఇక్కడ పూజిస్తారు. బర్మీస్ సాహిత్యం కూడా హిందూమతం ద్వారా సుసంపన్నమైంది. బర్మా రామాయణాన్ని యమ జట్దావ్ అని పిలుస్తారు. చాలా మంది హిందూ దేవుళ్లను బర్మీస్ ప్రజలు పూజిస్తారు. సరస్వతి (బర్మీస్‌లో తుయతాడి అని పిలుస్తారు), జ్ఞాన దేవత, పరీక్షలకు ముందు తరచుగా పూజిస్తారు; శివుణ్ణి పరమిజ్వా అంటారు; విష్ణువును వితనో అంటారు. ఈ ఆలోచనలు చాలా వరకు బర్మీస్ సంస్కృతిలో కనిపించే ముప్పై ఏడు నాట్ లేదా దేవతలలో భాగం.

ఆధునిక మయన్మార్‌లో, చాలా మంది హిందువులు యాంగోన్, మాండలే పట్టణ కేంద్రాలలో కనిపిస్తారు. ప్రాచీన హిందూ దేవాలయాలు 11 వ శతాబ్దంలోనే బర్మా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. బగన్‌లో ఉన్న నాథ్‌లాంగ్ క్యాయుంగ్ ఆలయంలో విష్ణుమూర్తి కొలువున్నాడు.

మయన్మార్‌లో ఇస్కాన్ (హరే కృష్ణ) ఉనికి ఉంది. మైత్కినాలో దాదాపు 400 మంది అనుచరులతో అతిపెద్ద హరే బ్కృష్ణ సంఘం ఉంది. [11]

హిందువులపై హింస[మార్చు]

ఖా మౌంగ్ సీక్ మారణకాండలో మరణించిన కుటుంబ సభ్యుల శవాలను గుర్తించడానికి హిందూ గ్రామస్థులు గుమిగూడారు.

బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, నే విన్ ఆధ్వర్యంలోని బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ విదేశీయుల వ్యతిరేక విధానాలను అవలంబించింది. 1963 - 1967 మధ్య బర్మా నుండి 1,00,000 మంది చైనీయులతో పాటు 3,00,000 మంది భారతీయ జాతి ప్రజలను (వీరిలో చాలా మంది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు ఉన్నారు) బహిష్కరించారు.

2017 ఆగస్టు 25 న, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని ఉత్తర మౌంగ్‌డా జిల్లాలో ఖా మౌంగ్ సీక్ అనే ఒక క్లస్టర్‌లోని గ్రామాలపై అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ARSA)కి చెందిన రోహింగ్యా ముస్లింలు దాడి చేశారు. దీనిని ఖా మౌంగ్ సీక్ ఊచకోత అని పిలుస్తారు. ఆ రోజు దాదాపు 99 మంది హిందువులు మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. [12] [13] రోహింగ్యా హిందువులు రోహింగ్యా ఉగ్రవాదుల వల ఏర్పడిన రోహింగ్యా వ్యతిరేక సెంటిమెంటుకు భయపడి తమను తాము చిట్టగోనియన్ అని చెప్పుకుంటారు. [14] కొన్ని మీడియా ప్రచురణల ప్రకారం, మయన్మార్, బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో రోహింగ్యా హిందువులు (ముఖ్యంగా మహిళలు) రోహింగ్యాల చేతిలో బలవంతపు కిడ్నాప్, మతపరమైన దుర్వినియోగం, "బలవంతపు మత మార్పిడుల"ను ఎదుర్కొన్నారు. [15]

హిందూ సంస్థలు, దేవాలయాలు[మార్చు]

మయన్మార్ హిందూ సెంట్రల్ కౌన్సిల్ సనాతన్ ధర్మ స్వయంసేవక్ సంఘ్ మయన్మార్‌లోని రెండు అతిపెద్ద హిందూ సంస్థలు. [16]

ఆల్ మయన్మార్ గూర్ఖా హిందూ మత సంఘం గూర్ఖా హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక హిందూ సంస్థ. ఇస్కాన్‌కు మయన్మార్‌లో 12 కేంద్రాలున్నాయి. బ్రహ్మచారులకు మతపరమైన విద్యను అందించే పాఠశాల జయ్యవాడిలో ఉంది. [17]

దేవాలయాలు[మార్చు]

  • నాథ్‌లాంగ్ క్యాయుంగ్ ఆలయం
  • కాళీ దేవాలయం, బర్మా
  • వరదరాజ పెరుమాళ్ ఆలయం
  • మహాలక్ష్మి దేవాలయం
  • కాళీ అమ్మన్ ఆలయం
  • కార్తైరి ఆలయం
  • రాధా మండలేశ్వర ఆలయం
  • రామమందిరం
  • గణేశ దేవాలయం 

మూలాలు[మార్చు]

 

  1. "Religion in Burma". globalreligiousfutures.org. Archived from the original on 2021-11-12. Retrieved 2021-12-26.
  2. "Myanmar population by religion" (PDF). Myanmar UNFPA. Archived (PDF) from the original on 2017-08-11. Retrieved 3 August 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2017-08-01 suggested (help)
  3. Natarajan, Swaminathan (6 March 2014). "Myanmar's Tamils seek to protect their identity". Retrieved 21 August 2018 – via www.bbc.com.
  4. Han, Thi Ri. "Myanmar's Hindu community looks west". Retrieved 21 August 2018.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tck అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Seekins 2006, p. 216.
  7. "Table: Religious Composition by Country, in Percentages". 18 December 2012. Retrieved 21 August 2018.
  8. "UNION_2-C_religion_EN.pdf". Google Docs. Retrieved 2020-12-08.
  9. Kesavapany, K. (2003-08-01). Rising India and Indian Communities in East Asia (in ఇంగ్లీష్). Flipside Digital Content Company Inc. ISBN 978-981-4517-60-7.
  10. NA, NA (2016-04-30). Ethnic Chinese As Southeast Asians (in ఇంగ్లీష్). Springer. ISBN 978-1-137-07635-9.
  11. "How Hare Krishna came to Myanmar". City: World. Frontier Myanmar. TNN. 16 November 2017. Retrieved 9 January 2020.
  12. "Rohingya militants slaughtered 99 Hindus in a single day: Amnesty International". Retrieved 21 August 2018.
  13. "Rohingya militants 'massacred Hindus'". 22 May 2018. Retrieved 21 August 2018 – via www.bbc.com.
  14. "'Don't call us Rohingya': Myanmarese Hindu refugees in Bangladesh detest the incorrect labelling - Firstpost". www.firstpost.com. Retrieved 21 August 2018.
  15. "Hindu Rohingya refugees forced to convert to Islam in Bangladesh camps". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-03-21.
  16. "Hindu Organizations Condemn ARSA Attacks". The Irrawaddy (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-10-03. Retrieved 2021-03-21.
  17. "How Hare Krishna came to Myanmar". City: World. Frontier Myanmar. TNN. 16 November 2017. Retrieved 9 January 2020.