Jump to content

మరకతమణి

వికీపీడియా నుండి
మరకతమణి
Theatrical release poster
దర్శకత్వంఏఆర్‌కే శరవణన్‌
స్క్రీన్ ప్లేఏఆర్‌కే శరవణన్‌
కథఏఆర్‌కే శరవణన్‌
నిర్మాతరిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
తారాగణంఆది పినిశెట్టి
నిక్కీ గల్రానీ
కోట శ్రీనివాసరావు
ఆనందరాజ్
ఛాయాగ్రహణంపి.వి.శంకర్
కూర్పుప్రసన్న జికె
సంగీతందిబునినన్ థామస్
నిర్మాణ
సంస్థలు
రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
విడుదల తేదీ
జూన్ 16, 2017 (2017-06-16)
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మరకతమణి 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో తమిళంలో 'మరగాధ నాణ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమాను రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యానర్‌లపై డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ, కోట శ్రీనివాసరావు, ఆనందరాజ్, అరుణ్ రాజ్‌, రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేశారు.[1]

అనంతపురంకు చెందిన రఘు నందన్ (ఆది) అప్పులు తీర్చడం కోసం హైదరాబాద్ వచ్చి స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకొని తన స్నేహితుడితో కలిసి రాందాస్‌ గ్యాంగ్ లో స్మగ్లింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అయితే తన అప్పులు తీరడానికి ఇలాంటి చిన్న చిన్న డీల్స్ సరిపోవని, మరకతమణిని తెస్తే పదికోట్లు ఇస్తానని ఓ చైనా స్మగ్లర్ నుండి డీల్‌ రావడంతో ఆ డీల్‌ కు ఒప్పుకుంటాడు. మరకతమణిని ఎవరు తాకినా మరణిస్తుంటారు. మరి మరకతమణిని రఘు గ్యాంగ్ దక్కించుకోగలిగారా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
  • నిర్మాత: రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్‌కే శరవణన్‌
  • సంగీతం: దిబు నైనన్‌ థామస్‌[3]
  • సినిమాటోగ్రఫీ: పి.వి.శంకర్
  • మాటలు: రాకేందు మౌళి

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (12 June 2017). ""మ‌ర‌క‌త‌మ‌ణి"" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. The Times of India (16 June 2017). "'Marakathamani' Movie review highlights: The movie is a thorough entertainer" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. Zee Cinemalu. "గ్రాండ్ గా రిలీజైన మరకతమణి ఆడియో" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మరకతమణి&oldid=3626790" నుండి వెలికితీశారు