మస్కు నర్సింహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మస్కు నర్సింహ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
ముందు కొండ్రు పుష్పలీల
తరువాత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
చిన్నతూండ్ల, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2020 జులై 28
హైదరాబాద్
విశ్రాంతి స్థలం చిన్నతూండ్ల
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం పార్టీ
సంతానం ఇద్దరు కుమారులు

మస్కు నర్సింహ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో ఇబ్రహీంపట్నం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మస్కు నర్సింహ 1968లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చిన్నతూండ్ల గ్రామంలో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మస్కు నర్సింహ విద్యార్థి దశ నుండి సీపీఎం పార్టీ అనుబంధ సంఘాలైన డీవైఎ్‌ఫఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘంలో పలు బాధ్యతలు నిర్వహించి 1995 నుంచి 2000 వరకు చిన్నతూండ్ల ఎంపీటీసీగా పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

మస్కు నర్సింహ ఘగర్, బీపీ లెవల్స్‌ పెరగడంతో నిమ్స్‌లో చేరి చికిత్స పొందుతూ గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో ఆరోగ్యం క్షీణించి 2020 జులై 28న మరణించాడు. ఆయనకు ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (28 July 2020). "మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. Sakshi (28 July 2020). "ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.