మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


పదవీ కాలం
2009 - 2014, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
ముందు మస్కు నరసింహ
నియోజకవర్గం ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953, ఏప్రిల్ 11
ఎలిమినేడు, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు భూపాల్ రెడ్డి - పద్మమ్మ
జీవిత భాగస్వామి ముకుంద
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య[మార్చు]

కిషన్‌రెడ్డి 1953, ఏప్రిల్ 11న భూపాల్ రెడ్డి - పద్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కిషన్‌రెడ్డి, హైదరాబాదులోని నిజాం కళాశాల నుండి 1975 బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కిషన్‌రెడ్డికి ముకుందతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై 11,056 ఓట్ల మెజారిటీతో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి ఎం. రాంరెడ్డిపై గెలుపొందాడు.[4] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప స్వతంత్ర అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి  పై 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6]

హోదాలు[మార్చు]

  1. 2000 - 2004: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్
  2. 26.05.2016 - 06.09.2018: తెలంగాణ శాసనసభ గ్రంథాల కమిటీ చైర్మన్
  3. 22.09.2019 - ప్రస్తుతం: ప్రభుత్వ హామీలపై కమిటీ చైర్మన్

ఇతర వివరాలు[మార్చు]

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-07.
  2. "Manchireddy Kishan Reddy(TRS):Constituency- IBRAHIMPATNAM(RANGA REDDY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-07.
  3. "Manchireddy Kishan Reddy | MLA | TRS | Ibrahimpatnam | Ranga Reddy". the Leaders Page (in ఇంగ్లీష్). 2020-04-18. Retrieved 2021-09-07.
  4. "Manchireddy Kishan Reddy MLA of Ibrahimpatnam Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.
  5. "Ibrahimpatnam Assembly election: Sitting MLA Manchireddy Kishan Reddy of TRS is leading". www.timesnownews.com. Retrieved 2021-09-07.
  6. "Ibrahimpatnam Election Result 2018 Live Updates: Manchireddy Kishan Reddy of TRS Leading". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.