కొండ్రు పుష్పలీల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండ్రు పుష్పలీల
కొండ్రు పుష్పలీల


మాజీ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం 1963 (age 57–58)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

కొండ్రు పుష్పలీల (జ.1963) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించింది.[1] మహిళా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

పుష్పలీల 1963లో హైదరాబాద్ లోని వ్యాపారస్థుల కుటుంబంలో జన్మించింది. పుష్పలీల ఎనిమిది తోబుట్టువుల మధ్య రెండో సంతానం. వివాహం తర్వాత డిగ్రీ పూర్తిచేసింది. 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., 1994 లో ఎం.ఫిల్ పూర్తిచేసింది.

వివాహం[మార్చు]

పుష్పలీలకు 1981 లో కొండ్రు రాందాస్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

రాజకీయ జీవితం[మార్చు]

ఈవిడ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం పోరాటం చేసింది. 'ప్రజల వద్దకు పాలన' సమయంలో తెలుగుదేశం పార్టీ లోని చేరింది. 1999 లో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, పదిహేను సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పాలనను ఓడించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీలో టికెట్టు రాకపోవడంతో అటుతరువాత భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి, పిసిసి కార్యదర్శి అయింది.[2] 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం పు అభ్యర్థిగా ఉంది.[3][4]

మూలాలు[మార్చు]

  1. Vadde, Babu Mohan renominated; 9 replaced[permanent dead link]The Hindu March 31, 2004
  2. Assurance to small industries Times of India - November 23, 2002
  3. సాక్షి. "'మాజీల పోరు'లో గెలిచేదెవరో." Retrieved 27 February 2017.
  4. ఆంధ్రజ్యోతి. "రంగారెడ్డిలో రాజకీయ పునరేకీకరణ". Retrieved 27 February 2017.