Jump to content

మహపద్మ నంద

వికీపీడియా నుండి
నంద సామ్రాజ్యం

క్రీ.పూ. 424–క్రీ.పూ. 321
The Nanda Empire at its greatest extent under Dhana Nanda circa 323 BC.
The Nanda Empire at its greatest extent under Dhana Nanda circa 323 BC.
రాజధానిపాటలీపుత్ర
సామాన్య భాషలుసంస్కృతం
మతం
Jainism
Hinduism
Buddhism
ప్రభుత్వంMonarchy
సామ్రాట్ 
చారిత్రిక కాలంAntiquity
• స్థాపన
క్రీ.పూ. 424
• పతనం
క్రీ.పూ. 321
Preceded by
Succeeded by
[[శిశునాగ వంశం]]
[[మౌర్య సామ్రాజ్యం]]

సామ్రాట్ మహపద్మనంద నంద రాజ్యం స్థాపకుడు, అఖిల భరతఖండాన్ని పాలించిన మొట్టమొదటి చక్రవర్తి. భారతదేశాంలో అప్పటి దాక ఉన్న క్షత్రియ పాలన అంతటినీ దాదాపుగా నాశనము చేసి నంద రాజ్యన్ని స్థాపించి అఖిల భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి వాడు మహాపద్మ నంద.

నంద రాజులు భరత ఖండాన్ని 100 సంవత్సరములు పైగా పరిపాలించారు, కానీ ప్రఖ్యాత రచయిత“జయంతనుజ బంద్యోపాధ్యయ” రచించిన  “CLASS AND RELIGION IN ANCIENT INDIA” అను గ్రంధములో నంద రాజులు భరతఖండముని 150 సంవత్సరములు పైగా పరిపాలించారు అని వ్రాసినారు.

మహాపద్మనంద మగధ దేశములో ఒక సామాన్య పౌరుడు. పురాణ రచయితలు మహాపద్మనందను ఒక క్షురకుడుగానే అభివర్ణించారు కానీ నిజానికి ఆయన ఒక వైద్యుడు, క్రీస్తుపూర్వం 5,4వ శతాబ్దాలలో క్షవరం వైద్యంలో భాగముగానే ఉండేది తప్ప దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లేదు. కీ.పూ.5-4వ శతాబ్ధానికి చేందిన మహాపద్మనంద అప్పటి మగధ సామ్రాజ్య శిశునాగ వంశపు రాజైన "కాకవర్ణ(లేక)కాలశోకుడు" వద్ద ఆస్థాన వైద్యుడు గా పని చేసేవాడు.

కాలశోకుడు శిశునాగ వంశానికి చేందినవాడు అతనికి 10 మంది కుమారులు. కాలశోకుడు అతని కుమారులు క్షవర వైద్యం చేసే సమయములో మహాపద్మనందుడిని అతి నీచంగా దూషించి అవమానించేవారు.

రోజులాగే ఆ రోజు కుడా మహాపద్మనంద క్షవర వైద్యం చేయడానికి మగధ సామ్రాజ్యనికి వెళ్తాడు. మహపద్మనంద క్షవర వైద్యం చేసే సమయములో ఆయనని దుర్భాషలాడుతున్న వారిని చూసి తట్టుకోలేక మహపద్మనందుడు క్షవరము చేసే కత్తితోనే కాలశోకుడిని అతని 10 మంది కుమారులని సంహరిస్తాడు. పూర్వపు రోజులలో వైద్యులు వాడే కత్తి అతి పడునైనది వెంట్రుకను సైతం చీల్చగలిగేటంత పదునైన కత్తులు వైద్యులు వాడేవారు.

శిశునాగ వంశం మొత్తాన్ని మహపద్మనంద తుదముట్టించిన తరువాత మగధ సామ్రాజ్యానికి తనకు తానే రాజుగా ప్రకటించుకుంటాడు, కాని అక్కడ ఉన్న కోంతమంది సైన్యం తిరుగుబాటు చేస్తారు క్షురకుడువి నువ్వు రాజు ఏమిటి అని. కాని మహాపద్మనందుడు ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు విజయగర్వంతో మహపద్మ నందుడు భారతదేశంలో ఉన్న క్షత్రియ రాజ్యాలన్ని దాదాపుగా నాశనము చేసి “నంద రాజ్యం” స్థాపించాడు.

మహాపద్మనందుడిని "మహపద్మ పతి, ఉగ్రసేనుడు, మహాక్షాతప్ర, ఏకచత్రాధిపతి, మహక్షాత్రంతక " అని కుడా పిలిచేవారు. "మహక్షత్రాంతక" అనగా క్షత్రీయ రాజుల మొత్తాన్ని సంహరించినవాడు అని అర్ధం.

                                  కోంతమంది పురాణ రచయితలు "నంద" అనగా అర్ధం ఈ విధముగా వివరించినారు. నంద రాజులు క్షౌరవైద్యుల కులానికి చెందిన శివ భక్తులు, శివుని వాహనం "నందీశ్వరుడు" కావున నంద రాజులు ఆ నందీశ్వరుడు వలే ఆ పరమ శివుని మీద వారికున్న భక్తిని చాటుటకు వారి పేరు ముందు "నంద" అనే పేరును వాడేవారు అని వివరించినారు ఈ కారాణం చేతనే మహపద్మనంద తన రాజ్యమును "నంద రాజ్యం" అని పేరుతో స్థాపించి ఉంటాడు అని రచయితలు అభిప్రాయ పడ్డారు.

మహాపద్మనందుడిని అపర పరశురాముడిగా అభివర్ణించేవారు, మహాపద్మనందుడు యుద్దానికి వస్తున్నాడు అని తెలియగానే అనేక రాజ్యాల వారు నందుడికి తమ రాజ్యముని అప్పగించి లోంగిపొయే వాళ్ళు ఈ విధముగానే మహపద్మనంద భారతఖండాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి అయినాడు. చాలమందికి ఒక సందేహం ఒక సాధారణ క్షవర వైద్యుడు అఖీల భరతఖండాన్ని పాలించిన మొదటి రాజు ఏమిటి అని కానీ క్షౌర వైద్యులు "మర్మకళలలో" నిష్ణాతులు ఈ కారణము చేతనే మహపద్మనంద శిశునాగవంశాన్ని అంతమొందించి ఏకచత్రాధిపతిగా భరతఖండాన్ని పాలించాడు.

క్రీస్తు పూర్వం 5-4వ శతాబ్ది నాటి నంద వంశ పాలనకు శ్రీకారం చుట్టిన మహాపద్మనందుడు ఆయన నిధిని భూగర్భంలో నిక్షిప్తం చేసినట్టు ప్రసిద్ధమైన కథ ప్రచారంలో ఉంది. ఈ మహాపద్మనందుడు వారసుడే చంద్రగుప్త మౌర్యుడు. లక్ష కోట్ల సువర్ణ ముద్రికలను సేకరించిన నందరాజు ఆ నిధిని గంగానది అడుగున నిక్షిప్తం చేశాడట! ‘మహాపద్మము’ అనగా ఒక సంఖ్య దీని విలువ లక్ష కోట్లని ‘బ్రౌన్’ నిఘంటుకారుడు నిర్ణయించాడు! గంగానదికి ఆనకట్ట కట్టి నీటిని మళ్లించి ఇసుక తేలిన నదిలో తవ్వి ఈ లక్షకోట్ల తులాల బంగారాన్ని నందుడు పూడ్చి పెట్టించాడట! కోటి టన్నుల బంగారమన్న మాట ఇప్పటి లెక్కల్లో! ఆ తరువాత ఆయన నదిని మళ్లీ సువర్ణ నిధి నిక్షిప్త ప్రాంతం మీదకి మళ్లించాడట ఆ ఆనకట్టను తెంపి. ఈ చారిత్రక వాస్తవాన్ని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన ‘చంద్రగుప్తుని స్వప్నం’ అన్న చారిత్రక రచనలో పేర్కోన్నారు. మహా పద్మనందుడన్న పేరు క్రీస్తునకు పూర్వం నాటి ఆ చక్రవర్తికి అందుకనే వచ్చిందట.

అపర పరశురాముడు గా ప్రజలతో కీర్తించబడిన మహాపద్మనంద తెలంగాణ ప్రాంతాన్నికుడా మగధ రాజ్యంలో విలీనం చేశాడు. కరీంనగర్ ‘రామడుగు’ వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట. ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది. అంతేకాదు మహపద్మనందుడు ఆంధ్రప్రదేశ్ లోని చాలప్రాంతాలని కుడా తమ మగధ రాజ్యములో విలినము చేసేడాని పురాణ రచయితలు పేర్కోనారు.

రెండోవ పరశురాముడుగా మహపద్మనంద: పురాణాల ప్రకారము మాకన్న బలవంతులు లేరు అని విర్రవీగుతున్న క్షత్రీయులందరిని బ్రాహ్మణుడైన "పరశురాముడు" వధించాడు, ప్రాణబితితో పారిపోయిన మిగిలిన ధన్వంతరి వంశీకుడైన " మహాపద్మనందుడు" వధించాడని పురాణరచయితలు చాల గ్రంధలలో పెర్కోన్నారు. అందుకే మహపద్మనందుడిని రెండోవ పరశురాముడిగా అభివర్ణించేవాళ్ళు, మహపద్మనందుడు “ఏకవిరాట్” బిరుదాంకితుడు.

నవ నందులు: సామ్రాట్ మహాపద్మనందకు తోమ్మిదిమంది కుమారులు వారిని "నవ నందులు" అని సంభోధిస్తారు అనగా 9 మంది నంద రాజకుమారులు అని అర్ధము వీరు ఒక్కోక్క ప్రాంతములో రాజ్యపరిపాలన కొనసాగించేవాళ్ళు క్షత్రీయులకన్న మిన్నగా నంద రాజ వంశీయులు రాజ్య పరిపాలన చేయగలం అని నిరూపించారు.

నంద రాజకుమారులు

[మార్చు]

● పందుక నంద(PANDUKA NANDA)
● పందుగతి నంద(PANDUGATI NANDA)
● భుతపాల నంద(BHUTAPALA NANDA)
● రాస్త్రపాల నంద(RASHTRAPALA NANDA)
● గోవిష్ణక నంద(GOVISHANAKA NANDA)   
      ● దశసిద్ధక నంద(DASHASIDDHAKA NANDA)
● కైవర్త నంద(KAIVARTA NANDA)
● మహేంద్ర నంద(MAHENDRA NANDA)
● ధననంద(DHANANANDA) నవ నందులలో ఆకరి వాడు. అఖీల భారతదేశాన్ని ఏకచత్రాధిపతిగా పాలించిన మహాపద్మనంద చనిపోయెనాటికి ఆయన వయస్సు 88 సంవత్సరములు.

ధననంద

[మార్చు]

మహాపద్మనంద అనంతరం ఆయన కుమారుడు నవ నందులలో ఆకరివాడు “ధననంద” రాజ్యపాలనని కోనసాగించాడు. ధననంద మహబలశాలి "నవ నందులలో" ఆకారి వాడు, చక్కటి అందగాడు. ధననంద ఎంతటి అందగాడో అంతకన్న ఎక్కువ బలశాలి. క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్ర చేయాలనుకున్నప్పుడు ఆ సమయములో భారతదేశాన్ని పాలిస్తున్న నంద రాజు అయిన ధననందుడి పరాక్రమముని తెలుసుకోని భయపడి యుద్ధం చేయకుండానే వెనుతిరిగేడు అని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ధననంద వలన అవమానించబడిన చాణక్యుడు ధననందుడిని నాశనము చేసేవరకు నిద్రపోనని శపధం చేసి ఆయన శిశ్యుడైన చంద్రగుప్తుని సహయముతో ధననందను యుద్ధములో ఓడించి నంద సామ్రజ్యమును అంతమొందించి చంద్రగుప్తునిచే మౌర్య రాజ్యమును స్థాపింపచేశాడు, ధననంద మంత్రి "రాక్షస" చాల తెలివైనవాడు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం మరియొకటి ఉన్నది చంద్రగుప్త మౌర్య మరేవరోకాదు నంద రాజుల వారసుడే

నంద సైన్యం

[మార్చు]

అశ్వకదళం 80,000
సైనిక ధళం 200,000
రధాలు 8,000
ఎనుగుల ధాళాలు 6,000


చంద్రగుప్త మౌర్యుడు
సామ్రాట్ (చక్రవర్తి)మౌర్యసామ్రజ్యము
ఎరుపు రాతితో గల నిలబడే యువకుని విగ్రహం
న్యూఢిల్లీ లోని బిర్లామందిర్ లో చంద్రగుప్త మౌర్యుని విగ్రహం
పరిపాలన322BC - 298BC
పూర్వాధికారినంద సామ్రాజ్యము యొక్క సామ్రాట్ ధననందుడు
ఉత్తరాధికారిబిందుసారుడు
జననం340 BC
పాటలీపుత్ర (పాట్నా) , బీహార్
మరణం298 BC
Shravanbelgola, Karnataka, India[1]
వంశముబిందుసారుడు
రాజవంశంమౌర్య సామ్రాజ్యము

చంద్రగుప్తమౌర్య

[మార్చు]

మౌర్య సామ్రాజ్యం స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్తుడు నంద రాజుకు, మురా అనే స్త్రీకు జన్మించినాడు. మౌర్య రాజ్యం భరతఖండాన్ని పాలించిన రెండోవ రాజ్యం. నంద రాజైన ధననంద చేతిలో అవమానం పోందిన చాణిక్యుడు చంద్రగుప్తుడిని రేచ్చకోట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర చెప్తున్నది.

చంద్రగుప్త మౌర్య(నంద వారశుడు)

[మార్చు]

చంద్రగుప్త మౌర్యుడు "మౌర్య సామ్రాజ్య" స్థాపకుడు. తన తల్లి 'ముర' పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశం మొత్తం పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. కానీ ‘మౌర్య’ అనే కులానికి చంద్రగుప్తమౌర్యకు ఎటువంటి సంబంధం లేదు. చంద్రగుప్తుని వంశ మూలాలు: చంద్రగుప్తుని పూర్వీకుల గురించి చాలామంది భారతీయ చరిత్రకారులు ఈ విధముగా వివరించినారు మగథ రాజ్యాన్ని పరిపాలించిన నందవంశానికి చెందిన ఒక రాజ కుమారునికీ, ముర అనే స్త్రీ కు పుట్టిన సంతానం చంద్రగుప్తుడు అని వివరించినారు. (ఆధార గ్రంధాలు: ముధ్రరాక్షస, విష్ణుపురాణం, భారతదేశ చరిత్ర, ద నందాస్ - ద గ్రేట్ బార్బర్ రూలర్స్ ఆఫ్ ఇన్ ఇండియా). ధననందుడి వలన తీవ్రముగా అవమానింపబడిన చాణక్యుడు ధననందుడిని నాశనము చేసే పనిలో ఆయనకు తగ్గ శిశ్యుడును వెతికే ప్రయత్నములో ఉండగా ఆయనకు ఒక బాలుడు కంటబడతాడు అతడే చంద్రగుప్తుడు. చాణక్యుడు ఆ బాలుడు యొక్క తెలివితేటలు చూసి ముచ్చటేసి ఆ బాలుడు ఎవరు అని ఆరతీయగా ఆ బాలుడు మరేవరో కాదు 'నంద' రాకుమారునికి, 'ముర' అనే స్త్రీకి జన్మించినవాడని కోన్ని పరిస్థితుల వలన నంద రాజ్యానికి ముర దేవి దూరంగా ఉంటుంది అని తెలుసుకున్న చాణిక్యుడు. ఎలాగైన చంద్రగుప్తునిచెతనే తన వంశాన్ని నాశనం చేయించాలి అని పునుకోని, తన తల్లికి జరిగిన అన్యాయం గురించి చంద్రగుప్తునికి చెప్పి అతనిని నంద రాజులమీద పగసాధింపు విధముగా తయారుచెస్తాడు. చాణిక్యుడుని కౌటిల్యుడు అని కుడా పిలుస్తారు కౌటిల్యుడు అనగా కుటిలబుద్ధికలవాడు అని అర్ధం. ఈ విధముగా నంద రాజుల మీద ద్వేషభావనని పెంచుకున్న చంద్రగుప్తుడు ఆకరి నంద రాజైన ధననంద మీదకు దండయాత్రచేసి ధననందుడుని రాజ్యభ్రష్టుడిని చేస్తాడు. నంద వారసుడైన చంద్రగుప్తుని చేతిలోనే తన వంశీయులను వధింపచేసిన చాణిక్యుడు తన తల్లి పేరుతో సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆజ్ఞాపిస్తాడు. చంద్రగుప్తుడి తల్లి పేరు ‘ముర ’ ఆమె పేరు మీదే మౌర్య సామ్రాజ్యం ఏర్పడినది. చాణక్యుడి కుటిలత్వంతో నంద రాజ్యము పేరుని మార్పుచేయించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపింపచేస్తాడు. చంద్రగుప్తుడిని “నందనవ్య” అని కుడా అంటారు. నందనవ్య అనగా నంద వంశము యొక్క వారసుడు అని అర్ధము. చంద్రగుప్తుడు 42వ యేట స్వర్గస్తులైన తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు రాజ్య పరిపాలన కోనసాగిస్తాడు.

మౌర్య సైన్యం

[మార్చు]

అశ్వకదళం 30,000
సైనిక ధళం 600,000
ఎనుగుల ధాళాలు 9,000

బిందుసారుడు

[మార్చు]

బిందుసారుడు రెండవ మౌర్య చక్రవర్తి. గ్రీకు వారు ఇతనిని 'అమిత్రోక్రేటిస్' లేదా 'అలిట్రోకేడిస్' అని పిలిచే వారు. ఇది సంస్కృత 'అమిత్రఘాత' ని గ్రీకులో కి మార్చారు. అమిత్రఘాతా అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం. బిందుసారుడు ఆయన తండ్రిలాగానే మంచి పరిపాలకుడు కుడా. చాణక్యుడి మరణం: చాణ‌క్యుడు తెలివితేట‌లు, ఎత్తుగ‌డ‌ల‌తో చంద్ర‌గుప్త మౌర్యుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు. అయితే అత‌ని కుమారుడైన బిందుసారుడు ఎలా జ‌న్మించాడో తెలుసా? చంద్ర‌గుప్తుడు అనేక మంది రాజుల‌తో యుద్ధాలు చేసి గెలవ‌డంతో అత‌నికి మహా చ‌క్ర‌వ‌ర్తి అనే పేరు వ‌చ్చింది. అదే కోవ‌లో అత‌న్ని చంపేందుకు కూడా శ‌త్రువులు త‌యార‌య్యారు. బ‌య‌టి నుంచి వ‌చ్చే శ‌త్రువుల క‌న్నా రాజు కోట‌లో ఉంటూ రాజుకు వెన్నుపోటు పొడిచే వారే ఎక్కువ‌గా ఉండేవారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన చాణుక్యుడు ఓ ఆలోచ‌న చేశాడు. చాణుక్యుడు రోజూ కొద్ది మొత్తంలో విషాన్ని చంద్ర‌గుప్తుడు తినే ఆహారంలో క‌లిపేవాడు. దీంతో విషం తిన్నా ఏమీ కాకుండా ఉంటుంద‌ని చాణ‌క్యుడి ఆలోచ‌న‌. అలా రోజూ చాణ‌క్యుడు చేసే వాడు. ఈ విష‌యం చంద్ర‌గుప్తునికి కూడా తెలియ‌దు. అయితే చంద్రగుప్తుడు ఒక రోజు త‌న‌కు ఇచ్చిన విషం క‌లిపిన ఆహారాన్ని త‌న రాణి దుర్ద‌కు తినిపిస్తాడు. దీంతో ఆ విష ప్ర‌భావం వ‌ల్ల ఆమె మ‌ర‌ణిస్తుంది. అయితే అప్ప‌టికే ఆమె నిండు గ‌ర్భిణీ. దీంతో విష‌యం తెలుసుకున్న చాణ‌క్యుడు హుటాహుటిన ప‌రిగెత్తుకుని వ‌చ్చి దుర్ద క‌డుపును చీల్చి అందులో ఉన్న బిడ్డ‌ను కాపాడుతాడు ఆ కాపాడిన బిడ్డే బిందుసారుడు. బిందుసారుడు యువకుడైనాక తన తల్లి మరణానికి కారణం చాణక్యుడు అని తెలుసుకోని చాణక్యుడను ప్రాణాలను వదిలేయమని ఆజ్ఞపించినట్లు కోన్ని పురాణ కధలు చెప్తున్నాయి, అలాగే జైన రచయిత హేమచంద్ర రాసిన గ్రంధములో బిందుసారుడు మంత్రుల్లో ఒకడైన "సుబంధు" చాణిక్యుడి మీద కోపముతో హతమర్చాడు అని వ్రాసినారు.

అశోకుడు

[మార్చు]

బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు రాజ్యపరిపాలన కోనసాగించారు. మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్, అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కారకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు కళింగ యుద్ధం: మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. కళింగ యుద్ధం అశోక చక్రవర్తి పాలనలోని 9వ సంవత్సరం నుండి మొదలయ్యింది. అంటే సుమారు క్రీ.పూ. 265 లేదా 264 లో అన్నమాట. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలుడయినాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు. యావద్దేశం జయించాలి అనే అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమనే సమయంలో స్వేచ్ఛ స్వతంత్ర అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు, కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు వధింపబడ్డారు. శోకమే ఎరుగని అశోకుడు ఈ ప్రాణ నష్టం చూసి శోకుడయ్యాడు. శాంతి కోసం బీజం వేశారు, ధర్మం కోసం మార్గం వేశారు. కళింగ యుద్దమే లేని నాడు అశోకుని శాంతి సందేశం లేదు, ధర్మ చక్రము లేదు. అందుకే కళింగ ప్రజలు తాము చనిపోయి అశోకునికి స్పూర్తి కలిగించిన శాంతి ప్రదాతలు. అయితే ఆ యుద్ధం అశోకుని జీవన సరళినే మార్చేసింది, యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చలించి పోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు, పది వేలకు పైగా ఆశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్ధ భూమిని ఆనుకుని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీతి. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలన విధానాలుగా చేసుకున్నాడు. అశోకుడు బౌద్ధ మతంలోకి చేరటం క్షున్నముగా పరిశీలిస్తే గౌతమ బుద్ధుడి మొదటి శిశ్యుడు, బౌద్ధులందరికి మొదటి నాయకత్వం వహించిన వాడు ఆచార్య ఊపాలి ‘ధన్వంతరికుల వైద్యుల' కులానికి చేందినవాడు ఈ కారణము చేతనే అశోకుడు బౌద్ధమతంలోకి వెల్లుటకు ఆసక్తి చూపినాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంక కు వెళ్ళి అక్కడి రాజును, రాణిని, ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు ఖచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.

నాయీబ్రాహ్మణ కులములో పుట్టిన నంద రాజవంశీయులు

[మార్చు]

• సామ్రాట్ మహాపద్మ నంద - నంద రాజ్యం స్థాపకుడు, భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు (క్రీ.పూ.424).
• సామ్రాట్ పంధుక నంద
• సామ్రాట్ పంఘుపతి నంద
• సామ్రాట్ భుతపలనంద
• సామ్రాట్ రస్త్రపలన నంద
• సామ్రాట్ గోవిష్ణక నంద
• సామ్రాట్ దషసిధక నంద
• సామ్రాట్ ఖైవర్త నంద
• సామ్రాట్ మహేంద్ర నంద
• సామ్రాట్ ధన నంద – (క్రీ.పూ.321) (‘నవనంద’ రాజులలో ఆకరివాడు)
• సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడు – (క్రీ.పూ. 322–298)
• సామ్రాట్ బిందుసారుడు - (క్రీ.పూ. 298 – 273 BC).
• సామ్రాట్ అశోకుడు - (క్రీ.పూ.273 – 232 BC).
• దశరథుడు - (క్రీ.పూ. 232 – 224 BC)
• సంప్రాతి - (క్రీ.పూ. 224 – 215 BC).
• శాలిసూక - (క్రీ.పూ. 215 – 202 BC).
• దేవవర్మన్ - (క్రీ.పూ. 202 – 195 BC).
• శతధన్వాన్ - (క్రీ.పూ. 195 – 187 BC)
• బృహద్రథుడు - (క్రీ.పూ. 187 – 184 BC)
గమనిక : ఇ మహాపద్మనంద చరిత్ర 'విశాకదత్తుడు రచించిన క్రీస్తూ పూర్వము 4 శతాబ్ధానికి చేందిన "ముద్రరాక్షస"గ్రంథము' లోనిది . చంద్రగుప్తుడు నంద వారసుడు అని అనేక గ్రంధాలలో రాసినారు " విశ్వనాధ సత్యనారాయణ రచించి (నందో రాజా భవిష్యతి, చంద్రగుప్తుని స్వప్నము), డి.డి.కోశాంబి (భారతదేశ చరిత్ర), విష్ణు పురాణము, క్రీ.పూ.4వ శతాబ్దం విశాకదత్తుడు రచించిన “ముద్రరాక్షస” గ్రంథాలలో చంద్రగుప్తుడు నంద రాజుకి అయన భార్య "ముర దేవి"కి పుట్టిన కుమారుడు అని రాసినారు.

ఆధార గ్రంథాలు

[మార్చు]

నంద రాజ వంశీయుల ఆధారాలు :
చంద్రగుప్త మౌర్య నంద రాజ కుమారుడు ఆధారాలు :
1. క్రీ.పూ.4వ శతాబ్దం విశాఖదత్తుడు రచించిన “ముద్రరాక్షస” గ్రంథంలో క్లుప్తంగా వివరించారు " చంద్రగుప్త మౌర్య నంద వంశీయుల వారసుడే " అని వివరించారు. (Visakadattas 4th century BC “Mudrarakshasa” Book)
2. ఎజెస్ ఆఫ్ ద నందస్ యండ్ మౌర్యస్ - (రచించిన వారు కె.ఎ.నీలకంఠ శాస్త్రి). (Ages Of The Nandas and Mauryas – Written by K.A.Neelakanta Sastri).
3. ద నందస్ (బార్బర్ రూలర్స్ ఇన్ ఇండియ) - (రచించిన వారు ధనరాజ్ టి.యం). (The Nandas (Barber Rulers In India) - Written by Dhanaraju T.M).
4. భారతదేశ చరిత్ర డిడి.కోసాంబి - ప్రఖ్యతిగాంచిన బౌద్ధమత రచేయిత డిడి.కోసంబి, ఇతను రాసిన అనేక గ్రంథాలలో కుడా “చంద్రగుప్త మౌర్య నంద వారసుడే “ అని రచించాడు. (“DD Kosambi” buddhist Writer – India History)
5. History Of Ancient India - Radhey Shyam Chaurasia.
6. A History Of India – Romola Thapar.
7. సాక్షి దినపత్రికలో (తేది: 20-11-2011) ప్రచురించిన ఫ్యామిలీ పెజిలో వచ్చిన ఆర్టికల్ లో కుడా “ చంద్రగుప్త మౌర్య నంద వారసుడే అని వ్రాసినారు “.

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chandragupta Maurya and his times By Radha Kumud Mookerji, 4th ed. 1966, p.40. ISBN 81-208-0405-8; 81-208-0433-3