మహిర ఖాన్
మహిర హఫీజ్ ఖాన్ (జననం 21 డిసెంబరు 1984), ప్రముఖ పాకిస్థానీ నటి. ఆమె పాకిస్థానీ సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించింది. పాకిస్థాన్ లోని ప్రముఖ నటీమణుల్లో ఈమె ఒకరు. మహిర అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే నటి. ఆమె ఎన్నో పురస్కారాలు అందుకొంది. లక్స్ స్టైల్, హమ్ పురస్కారాలు వంటి ఎన్నో ప్రముఖ అవార్డులను ఆమె గెలుచుకుంది.Urdu: ماہرہ حفیظ خان
తొలినాళ్ళ జీవితం, చదువు[మార్చు]
పాకిస్థాన్ లోని కరాచిలో 21 డిసెంబరు 1984న జన్మించింది మహీర. ఉర్దూ మాతృభాషగా గల పఠాన్ల కుటుంబంలో పుట్టింది ఆమె.[1] ఆమె తండ్రి హఫీజ్ ఖాన్ ఢిల్లీలో పుట్టి పెరిగినా, భారత విభజన తరువాత పాకిస్థాన్ కు కుటుంబంతో సహా వెళ్ళిపోయారు.
కరాచీలోని ఫౌండేషన్ పబ్లిక్ పాఠశాలలో చదువుకుంది మహిర.[2] ఆ తరువాత ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నత విద్య అభ్యసించింది. లాస్ ఏంజెలెస్ లోని సాంటా మోనికా కళాశాలలో చదువుకుంది మహిర. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో చేరింది. కానీ డిగ్రీ చదవకుండానే 2008లో పాకిస్థాన్ తిరిగి వచ్చేసింది మహిర. ఆమె చదువుకునే సమయంలో కాలిఫోర్నియాలోని ఒక షాపులో పని చేసింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ "Mahira Khan celebrating 32nd birthday today". The News. 21 December 2016. Retrieved 23 April 2017.
- ↑ "Profile: Mahira Khan | Newsline". Newsline. March 2012. Retrieved 14 December 2016.
- ↑ "Mahira Khan: 7 things to know about Humsafar's pretty Khirad Hussain". India.com. 15 October 2014. Retrieved 14 December 2016.