Jump to content

మొహమ్మద్ నిస్సార్

వికీపీడియా నుండి
(మహ్మద్ నిస్సార్ నుండి దారిమార్పు చెందింది)
మొహమ్మద్ నిస్సార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ నిస్సార్
పుట్టిన తేదీ(1910-08-01)1910 ఆగస్టు 1
హోషియార్‌పూర్, పంజాబ్
మరణించిన తేదీ1963 మార్చి 11(1963-03-11) (వయసు 52)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 9)1932 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా
మ్యాచ్‌లు 6 93
చేసిన పరుగులు 55 1120
బ్యాటింగు సగటు 6.87 10.98
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 14 49
వేసిన బంతులు 1,211 15,061
వికెట్లు 25 396
బౌలింగు సగటు 28.28 17.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 32
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 5/90 6/17
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 65/–
మూలం: ESPNcricinfo, 2020 మే 10

మొహమ్మద్ నిస్సార్ (1910 ఆగష్టు 1 - 1963 మార్చి 11) క్రికెట్ ఆటగాడు. అతను స్వాతంత్ర్యానికి ముందు భారత క్రికెట్ జట్టు లోను, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్‌లోని దేశీయ జట్ల లోనూ ఫాస్ట్ బౌలరుగా ఆడాడు. [1] అతను పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జన్మించాడు. స్వాతంత్ర్యానికి ముందు అత్యంత వేగవంతమైన భారత పేస్ బౌలర్‌గా అతన్ని పరిగణించేవారు. అతని కాలంలో అతను ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు.

భారత బ్యాట్స్‌మెన్ సికె నాయుడు తన మొదటి స్పెల్ సమయంలో, ఇంగ్లీషు ఆటగాడు హెరాల్డ్ లార్‌వుడ్ కంటే నిస్సార్ వేగంగా ఉన్నాడని రాసాడు. 1932లో అపఖ్యాతి పాలైన బాడీలైన్ సిరీస్‌లో లార్‌వుడ్ ఆస్ట్రేలియాను భయభ్రాంతులకు గురిచేసాడు. అమర్ సింగ్‌తో కలిసి నిస్సార్, భారతీయ ఫాస్ట్ బౌలింగ్ ద్వయాన్ని ఏర్పరచాడు. 1930లలో ప్రపంచంలోనే వీళ్ళిద్దరినీ అత్యుత్తమమైనది జంటగా పరిగణించారు. అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వ్యవస్థాపకులలో ఒకడు. అతను 1947లో పాకిస్థాన్‌కు వలస వెళ్ళి 1963లో లాహోర్‌లో మరణించాడు.

కెరీర్

[మార్చు]
1932లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత టెస్టు క్రికెట్ జట్టు. పోర్‌బందర్ మహారాజా కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు పై ఫోటోలో మొహమ్మద్ నిస్సార్ నిలుచున్నవారిలో నాల్గవ వ్యక్తి.

1932 లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టులోకి మహమ్మద్ నిస్సార్‌ను తీసుకున్నారు. అతను CK నాయుడు, వజీర్ అలీ నజీర్ అలీ సోదరులు, అతని ప్రసిద్ధ బౌలింగ్ భాగస్వామి అమర్ సింగ్ వంటి ఆటగాళ్ళున్న జట్టులో భాగం. భారతదేశం తరపున మొట్టమొదటి వికెట్ తీసిన వ్యక్తి నిసార్. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో భారతదేశంలో తయారైన అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిస్సార్ ఖ్యాతి పొందాడు. నిస్సార్, కెరీర్లో మొదటి మ్యాచ్‌లోనే తన రెండవ ఓవర్ మొదటి బంతికి హెర్బర్ట్ సట్‌క్లిఫ్‌ను 3 పరుగుల వద్ద స్టంపులను పడగొట్టాడు. ఆ తర్వాత, అదే ఓవర్‌లో ఐదో బంతికి, రెండో ఓపెనర్ పెర్సీ హోమ్స్‌ను బౌల్డ్ చేశాడు. [2]

పై వికెట్లు తీసుకోవడంలో ఒక అసాధారణమైన సంగతి ఏమిటంటే, దానికి కేవలం పది రోజుల క్రితమే యార్క్‌షైర్‌ తరఫున ఆడుతూ హోమ్స్, సట్‌క్లిఫ్ ఇద్దరూ కలిసి 555 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించారు.[3] 26-ఓవర్ల స్పెల్‌లో నిస్సార్, 93 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.[4] ఇంగ్లండ్ 259 పరుగులకు ఆలౌటైంది. కాగితంపై చాలా బలంగా కనిపించిన ఇంగ్లాండ్ జట్టుకు అది తక్కువ స్కోరు. రెండో ఇన్నింగ్స్‌లో నిస్సార్, 18 ఓవర్లు బౌలింగ్ చేసి, వాల్టర్ రాబిన్స్ వికెట్‌ను తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతని వికెట్‌ను నిసారే తీసుకున్నాడు. మొత్తంమీద ఆ మ్యాచ్‌లో నిసార్, 44 స్ట్రైక్ రేట్‌తో, 135 పరుగులకు 6 వికెట్లు తీసాడు.

ఆ సంవత్సరం భారతదేశానికి అది ఏకైక టెస్ట్ మ్యాచ్. కానీ పర్యటనలో అనేక ఇతర ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. వాటిలో నిస్సార్, 18.09 సగటుతో 71 వికెట్లు తీశాడు. 1935-36లో, జాక్ రైడర్ నేతృత్వం లోని ఆస్ట్రేలియా XI, విజయనగరం మహారాజా "విజ్జీ" జట్టుతో ఆడటానికి భారతదేశం వచ్చినప్పుడు నిసార్, 4 అనధికారిక టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు.

నిస్సార్ చివరి టెస్టు 1936 ఆగస్టులో ఇంగ్లండ్‌కి వ్యతిరేకంగా ది ఓవల్‌లో జరిగింది. ఇక్కడ అతను ఐదు వికెట్ల పంటతో సహా ఆరు వికెట్లు తీసాడు. ఆ మ్యాచ్‌లో భారతదేశం ఓడిపోయింది. [5]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Mohammad Nissar". ESPN Cricinfo. Retrieved 10 May 2020.
  2. Wisden – England v India 1932. Espncricinfo.com (30 July 2007). Retrieved on 2018-05-11.
  3. Indian Cricket Fever – Fast bowling legacy: Nissar and Amar Singh. Cricketnetwork.co.uk (10 June 2003). Retrieved on 2018-05-11.
  4. "Only Test: England v India at Lord's, Jun 25–28, 1932". espncricinfo. Retrieved 18 December 2011.
  5. Statsguru, bowling innings list. Stats.espncricinfo.com. Retrieved on 11 May 2018.