మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1989 - 1991 | |||
ముందు | గారపాటి సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | మాగంటి వరలక్ష్మి | ||
నియోజకవర్గం | దెందులూరు నియోజకవర్గం | ||
మంత్రి
| |||
పదవీ కాలం 1989 - 1991 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1945 చాటపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాగంటి వరలక్ష్మి | ||
సంతానం | మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత. ఆయన దెందులూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా జడ్పి ఛైర్మన్‌గా పని చేశాడు.ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దెందులూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం 1990 డిసెంబర్ 17న చేసి ఇంటికి వెళుతూ మార్గమధ్యలోనే గుండెపోటు రావడంతో చనిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 March 2019). "ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు". Retrieved 1 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)