మాగంటి వరలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాగంటి వరలక్ష్మీ దేవి

మంత్రి
పదవీ కాలం
1991 - 1994
ముందు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
తరువాత గారపాటి సాంబశివరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1948
దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
సంతానం మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)
వృత్తి రాజకీయ నాయకురాలు

మాగంటి వరలక్ష్మీ దేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1991లో జరిగిన ఉప ఎన్నికలో దెందులూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

మాగంటి వరలక్ష్మి తన భర్త మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1991లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో దెందులూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పని చేసింది. ఆమె 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 March 2019). "ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు". Retrieved 1 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)