మాదాసువారిపాలెం
మాదాసువారిపాలెం. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మాదాసువారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 153. |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం కోలవెన్ను గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
[మార్చు]శ్రీ భక్త ప్రపత్తి ఆంజనేయస్వామివారి ఆలయం -ఈ గ్రామములో వేంచేసియున్న శ్రీ భక్త ప్రపత్తి ఆంజనేయస్వామి, సువర్చలాదేవి వార్ల కల్యాణమహోత్సవం, 2014,జూన్-7 శనివారం నాడు కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరుసటి రోజు ఆదివారం నాడు, 2 వేలమందికి అన్నసంతర్పణ నిర్వహించారు. [2]
ఈ ఆలయంలో నూతన ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-1వతేదీ గురువారం నుండి ప్రారంభమయినవి. జూన్-3వతేదీ శనివారం ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం మొదలగు కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఉదయం 9 గంటలకు ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన నిర్వహించినారు. ఆ రోజున ఉదయం 11 గంటల నుండి భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. సాయంత్రం శ్రీ సువర్చల, ఆంజనేయస్వామివార్ల కళ్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామం వివాదరహిత గ్రామంగా పేరుపొందింది. ఈ మేరకు గ్రామ సర్పంచి ఈడా కొండలరావుకి, న్యాయ సేవాధికార సంస్థ నుండి ప్రశంసలు అందినవి. [1]
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు, విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-14; 1వపేజీ. [2] ఈనాడు, విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-9, 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,జూన్-1&4; 1వపేజీ.