అక్షాంశ రేఖాంశాలు: 31°04′06″N 79°25′00″E / 31.06833°N 79.41667°E / 31.06833; 79.41667

మానా కనుమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

మానా కనుమ
(చోంగ్నీ లా)
మానా గ్రామం, బద్రీనాథ్, ఉత్తరాఖండ్
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,632 m (18,478 ft)
(SRTM2)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
జాతీయ రహదారి 58
ప్రదేశంఉత్తరాఖండ్, భారతదేశంటిబెట్, చైనా
శ్రేణిగఢ్వాల్ హిమాలయాలు
Coordinates31°04′06″N 79°25′00″E / 31.06833°N 79.41667°E / 31.06833; 79.41667
మానా is located in Uttarakhand
మానా
మానా

మానా కనుమ, వాహనాలు వెళ్ళగలిగే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కనుమలలో ఒకటి.[1] దీన్ని చోంగ్నీ లా అని కూడా అంటారు. సరిహద్దు రహదారుల సంస్థ 2005-2010 కాలంలో భారత సైన్యం కోసం రహదారి నిర్మించింది. టిబెట్ వైపున ఉన్న కొత్త రహదారి కంటే, భారతదేశం వైపున ఉన్న కంకర రోడ్డు ఎక్కువ ఎత్తున ఉంటుంది.

భౌగోళికం

[మార్చు]

మానా కనుమ, మానా పట్టణం నుండి ఉత్తరాన 47 కి.మీ., బద్రీనాథ్ పట్టణానికి ఉత్తరాన 52 కి.మీ. దూరంలో, నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌లో ఉంది. ఇది, అలకనంద నది సరస్వతి నది ఉద్భవించిన స్థానం. ఆ నది కనుమకు నైరుతి దిశలో మూడు కి.మీ. దూరంలో ఉన్న దేవ్‌తాల్ సరస్సు వరకు అనేక సుందరమైన చిన్న చెరువులను నింపుతూ ప్రవహిస్తుంది. చౌఖంబా శిఖరాన్ని అధిరోహించడానికి మానా కనుమ గుండా వెళ్తారు.

చరిత్ర

[మార్చు]

మానా కనుమ ఉత్తరాఖండ్, టిబెట్‌ల మధ్య పురాతన వాణిజ్య మార్గం. ఈ మార్గం బద్రీనాథ్ నుండి మానా కనుమ మీదుగా టిబెట్‌లోని గుగే రాష్ట్రానికి వెళ్తుంది. పోర్చుగీస్ జెస్యూట్స్ ఆంటోనియో డి ఆండ్రేడ్, మాన్యుయెల్ మార్క్వెస్ లు 1624 లో మానా కనుమ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి యూరోపియన్లు. 1951 లో చైనీయులు మూసివేసే వరకు ఈ కనుమ చిన్న వాణిజ్య మార్గంగా కొనసాగింది. 1954 ఏప్రిల్ 29 న చైనా, భారత తీర్థయాత్రికులూ, స్థానిక ప్రయాణికులూ మానా కనుమ ద్వారా రెండు దేశాల మధ్య ప్రయాణించే హక్కును మంజూరు చేసే ఒప్పందంపై సంతకం చేశాయి.

చేరుకోవడం

[మార్చు]

ఫజిల్కాను బద్రీనాథ్‌తో కలిపే భారతదేశ జాతీయ రహదారి 7 (ఎన్‌హెచ్-7, పాత సంఖ్య ఎన్‌హెచ్-58) పొడిగింపు ద్వారా దక్షిణం నుండి ఈ కనుమను చేరుకోవచ్చు. అయితే బద్రీనాథ్ తరువాత ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. ఔత్సాహిక మోటార్‌సైకిల్ గుంపులు తరచుగా ఈ రోడ్డులో కనిపిస్తాయి. ఫ్రీ సోల్స్ రైడర్ మోటార్‌సైకిల్ క్లబ్ మానా కనుమ వద్ద ఎత్తులను ఎక్కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Sharma, Seema. "Women bikers attempt record at Mana Pass". Times of India. Retrieved 9 June 2017.
  2. "Limca Book of Records". www.limcabookofrecords.in. Archived from the original on 2010-03-06. Retrieved 2024-08-28.
"https://te.wikipedia.org/w/index.php?title=మానా_కనుమ&oldid=4309389" నుండి వెలికితీశారు