మామిళ్ళదరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిళ్ళదరువు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మామిళ్ళదరువు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన గ్రామం.[1] కావలి మండల తీరప్రాంతంలోని మామిళ్ళదరువు అటవీ ప్రాంతంలో గ్రామదేవత 'ముందర పొట్టెమ్మ" భక్తుల పూజలందుకుంటున్నది. సంక్రాంతికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటినుండీ ప్రతి మంగళవారం, శుక్రవారం, ప్రత్యేకంగా ఆదివారం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండియేగాక, తమిళనాడు రాష్ట్రం నుండి గూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కోరికలు తీరిన భక్తులు, అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిచేశారు[2].

గ్రామనామ వివరణ[మార్చు]

మామిళ్ళదరవు అన్న గ్రామనామం మామిళ్ళ అన్న పూర్వపదం, దరవు అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. మామిళ్ళ అన్నది వృక్షసూచి కాగా దరవు అన్న పదం దొరవుకు రూపాంతరం. దొరవుకు అర్థం ఇసుకబావి, వడబావి లేదా కొలను.[3]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.
  2. ఈనాడు నెల్లూరు; జనవరి-13,2014; 5వ పేజీ.
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015.