మారంరాజు సత్యనారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారంరాజు సత్యనారాయణరావు

మారంరాజు సత్యనారాయణరావు రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ర్టార్‌.

జీవిత విశేషాలు

[మార్చు]

అతని స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామం. అతను 1969లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక పుస్తకలను రాసాడు. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రిజిస్ర్టార్‌గా, రాజకీయ శాస్త్రం విభాగానికి ఆచార్యుడిగా పదవులు నిర్వహించాడు[1].

ఇంటర్మీడియట్, బియ్యే, ఎంఏ (పొలిటికల్ సైన్స్) నిజాం కళాశాలలో ముగించుకున్న అతను "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాల" మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందాడు. 1960లో ఎం.ఏ. పూర్తిచేసిన అతను 1965లో ఖమ్మం కాలేజీకి పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాడు. అతను ప్రభుత్వ ఉద్యోగంలో వున్నప్పటికీ కమ్యూనిస్టులతో సన్నిహిత సంబంధాలుండేవి. రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా మార్క్సిజం అన్నా, కమ్యూనిజం అన్నా అతనికి ఆసక్తి ఉండేది. తర్వాత రాజమండ్రి, ఖమ్మం, నల్గొండ, సత్తుపల్లి కళాశాలలలోను ఆచార్యునిగా పనిచేశాడు. రెండవ పర్యాయం ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు నాటి సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి రాంరెడ్డి అతనిని విశ్వవిద్యాలయంలో పనిచేసేందుకు ఒప్పించాడు. అక్కడ రాజకీయ శాస్త్ర విభాగ ఆచార్యుడుగా పనిచేసిన రోజుల్లో రాష్ట్ర రాజకీయాలమీద పరిశోధనాత్మక గ్రంథం రాశాడు. ఆ తరువాత రాజకీయ రంగంపై పుస్తకాలు రాశాడు. 1983లో తెలుగుదేశం, నందమూరి తారక రామారావు విజయంపై "ఎన్నికల రాజకీయాలు" అనే పుస్తకం రాశాడు. ఇందిరా గాంధీ మెదక్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశాడు. 2016లో ‘ఇదీ తెలంగాణ’ పుస్తకం రాశాడు. అతను రాసిన ‘గ్రామాయణం’ పుస్తకంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని భూసంబంధాలు, గ్రామీణ పాలనా వ్యవస్థ, పటేల్, -పట్వారీ వ్యవస్థ, శిస్తు విధానం, రెవెన్యూ విధానం లాంటి విషయాలను విశదీకరించాడు[2].

అతను 2019 మే 4 న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "ప్రొఫెసర్‌ మారంరాజు కన్నుమూత". www.andhrajyothy.com. 2019-05-05. Retrieved 2019-08-02.[permanent dead link]
  2. "ఆదర్శ ఆచార్యులు". www.andhrajyothy.com. 2019-05-05. Retrieved 2019-08-02.[permanent dead link]
  3. "Maramraju Satyanarayana Rao, noted writer and academician, dies at 84 of cardiac arrest". Firstpost. Archived from the original on 2019-08-02. Retrieved 2019-08-02.

బాహ్య లంకెలు

[మార్చు]