Jump to content

మాళవిక సరుక్కై

వికీపీడియా నుండి
మాళవిక సరుక్కై
జననం1959
తమిళనాడు, భారతదేశం
వృత్తిశాస్త్రీయ నృత్యకళాకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
అమెరికా ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్‌తో మాళవిక

మాళవిక సరుక్కై ఒక భరతనాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు.[1][2][3]ఈమెకు 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[4] 2003లో భారతప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ఈమెను సత్కరించింది.[5]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1959, జూన్ 15వ తేదీన బొంబాయిలో జన్మించింది.[6] ఈమె తన 7వ యేటి నుండి కె.కళ్యాణసుందరం పిళ్ళై వద్ద తంజావూరు బాణీలో, ఎస్.కె.రాజరత్నం పిళ్ళై వద్ద వళువూర్ బాణీలో భరతనాట్యం నేర్చుకుంది.[7][8][9] ఇంకా ఈమె కళానిధి నారాయణన్ నుండి అభినయాన్ని, కేలూచరణ్ మహాపాత్ర, రమణి రాజన్ జెనాల నుండి ఒడిస్సీ నృత్యాన్ని నేర్చుకుంది.[7][8][9] ఈమె తన 12వ యేట ముంబైలో తొలి ప్రదర్శన ఇచ్చింది.[7][10] తరువాత దేశంలోని అనేక ప్రాంతాలలో[11][12] విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది.[13][14] వాటిలో న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, [15] జాన్ ఎఫ్.కెన్నెడి సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, [16] చికాగో[17]లలో ఇచ్చిన ప్రదర్శనలు ముఖ్యమైనవి. ఈమె జీవితాన్ని, నాట్యప్రదర్శనలను సమర్పణం పేరుతో భారత ప్రభుత్వం డాక్యుమెంటరీ సినిమా రూపంలో రికార్డు చేసింది.[7][8][13] ఈమెపై బి.బి.సి. డాన్సింగ్ పేరుతో 9 గంటల టెలివిజన్ డాక్యుమెంటరీని నిర్మించింది.[7][8][10] నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ముంబై ఈమెపై ద అన్‌సీన్ సీక్వెన్స్ - ఎక్స్‌ప్లోరింగ్ భరతనాట్యం త్రూ ద ఆర్ట్ ఆఫ్ మాళవిక సరుక్కై మరొక డాక్యుమెంటరీని నిర్వహించింది.[10]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

ఈమెకు కేంద్ర సంగీత నాటక అకాడమీ 2002లో భరతనాట్యంలో అవార్డును ప్రకటించింది.[4][7] ఈమె ఇంకా "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ నుండి కళైమామణి పురస్కారాన్ని, మృణాళినీ సారాభాయ్ అవార్డును, [13] నృత్య చూడామణి బిరుదును, సంస్కృతి అవార్డును, హరిదాస్ సమ్మేళన్ అవార్డును పొందింది.[2][7] 2003లో భారతప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.[2][5][7]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "INK Talks". INK Talks. 2015. Retrieved 8 February 2015.
  2. 2.0 2.1 2.2 "Kennedy Center". Kennedy Center. 2015. Retrieved 8 February 2015.
  3. "Walk The Talk with Malavika Sarukkai". NDTV. February 2006. Retrieved 8 February 2015.
  4. 4.0 4.1 "Sangeet Natak AKademi Award". Sangeet Natak AKademi. 2015. Archived from the original on 30 మే 2015. Retrieved 26 ఏప్రిల్ 2021.
  5. 5.0 5.1 "Padma Awards" (PDF). Padma Awards. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 26 ఏప్రిల్ 2021.
  6. web master. "Malavika Sarukkai". Oxford Reference. Retrieved 26 April 2021.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 "Indian Arts". Indian Arts. 2015. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 8 February 2015.
  8. 8.0 8.1 8.2 8.3 "Bengal Foundation". Bengal Foundation. 2015. Archived from the original on 8 February 2015. Retrieved 8 February 2015.
  9. 9.0 9.1 Malavika Sarukkai (2015). "Interview" (Interview). Interviewed by Veejay Sai. Retrieved 8 February 2015.
  10. 10.0 10.1 10.2 "Blouin Art Info". Blouin Art Info. 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2015. Retrieved 8 February 2015.
  11. "Malavika Sarukkai: A tribute to Thimmakka". INKTalks. 13 November 2013. Retrieved 8 February 2015.
  12. "Padmashri Malavika Sarukkai Performs Bharatanatyam - Yaksha 2014". Isha Foundation. 21 February 2014. Retrieved 8 February 2015.
  13. 13.0 13.1 13.2 "Canary Promo". Canary Promo. 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2015. Retrieved 8 February 2015.
  14. "TOI India performance". TOI. 27 June 2012. Retrieved 8 February 2015.
  15. "Huffington Post". Huffington Post. 21 December 2013. Retrieved 8 February 2015.
  16. Seibert, Brian (18 November 2012). "Stories Told With a Leap, Even a Shake". New York Times. Retrieved 18 May 2017.
  17. "Pulse Connects". Pulse Connects. 2015. Archived from the original on 8 February 2015. Retrieved 8 February 2015.

బయటి లింకులు

[మార్చు]