మితాలీ జగ్తాప్ వరద్కర్
మితాలీ జగ్తాప్ వరద్కర్ | |
---|---|
జననం | మితాలీ జగ్తాప్ నవంబరు 21 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటి |
మితాలీ జగ్తాప్ వరద్కర్, మరాఠీ సినిమా నటి.[1] 2010లో వచ్చిన బాబూ బ్యాండ్ బాజా సినిమాలో నటనకు 58వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2][3][4] తెన్మెర్కు పరువాకత్రు తమిళ సినిమాలో నటించిన శరణ్యతో ఈ జాతీయ పురస్కారాన్ని పంచుకుంది.
జీవిత విషయాలు
[మార్చు]శాస్త్రీయ నృత్యకారిణి, నాటక కళాకారిణి[3] అయిన వరద్కర్ నవంబరు 21న మహారాష్ట్రలోని ఔరంగాబాదులో జన్మించింది. ఔరంగాబాద్‌లోని వసంతరావు నాయక్ కళాశాలలో సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. 2004, నవంబరు 27న సినిమాటోగ్రాఫర్ సందీప్ వరద్కర్ ని వివాహం చేసుకుంది.
కళారంగం
[మార్చు]3వ తరగతి చదువుతున్నప్పుడు ‘దేవ్కి దేవ్కి’ సినిమాలో బాలనటిగా నటించింది. డిగ్రీ కోర్సుతోపాటు థియేటర్ ఆర్ట్స్‌లో చేరింది. తరువాత ముంబైకి వెళ్ళి అక్కడ ‘అశ్వథా’ అనే థియేటర్ గ్రూపులో చేరి ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో నాటక ప్రదర్శనలు చేసింది. 'కుసుమ్ క్కుసుమ్', 'కలిరే', 'సిఐడి సిఐడి', 'హకీకట్', 'కాగర్ కాగర్', 'ఆకాష్' (మరాఠీ) వంటి అనేక టీవీ సీరియళ్ళలో నటించింది. ‘విఠల్ విఠల్ ’, ‘ ఆగ్ ’ వంటి మరాఠీ సినిమాలతో గుర్తింపు పొందింది. పెళ్ళి తర్వాత నటనకు కొంత విరామం తీసుకొని, బాబు బ్యాండ్ బాజా సినిమాలో నటించి, జాతీయ అవార్డును గెలుచుకుంది.
సినిమాలు
[మార్చు]- రాజు
- ఆగ్
- విఠల్ విఠల్
- బాబూ బ్యాండ్ బాజా (2010)
- అసవ సుందర్ స్వాప్నాంచ బంగ్లా ఈటీవీ మరాఠీ సీరియల్
- కుకుసమ్ (2001)
మూలాలు
[మార్చు]- ↑ "South Indian films rocked at National Awards". The Hindustan Times. 20 May 2011. Retrieved 28 July 2021.
- ↑ Priscilla Jebaraj (20 May 2011). "South steals the show at National Film Awards". The Hindu. Retrieved 28 July 2021.
- ↑ 3.0 3.1 "List of winners: 58th National Film Awards". News18 India. 19 May 2011. Retrieved 28 July 2021.
- ↑ "58th National Film Awards: List of winners". Bollywood Life. Essel Group. Retrieved 28 July 2021.