శరణ్య (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరణ్య
Saranya-Ponvannan.jpg
జననం
షీలా

(1970-04-25) 1970 ఏప్రిల్ 25 (వయసు 53)
వృత్తిభారతీయ చలనచిత్ర నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్, నేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు1987-1996
2003 నుండి ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిపొన్‌వణ్ణన్
తల్లిదండ్రులు
  • కె.బి.రాజ్ (తండ్రి)

శరణ్య ఒక భారతీయ భాషా చలనచిత్ర నటి. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చలనచిత్రాలలో నటించింది.

విశేషాలు[మార్చు]

ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు కె.బి.రాజ్ కుమార్తె. ఈమె 1970, ఏప్రిల్ 25న కేరళ రాష్ట్రంలోని అలప్పుళాలో జన్మించింది. ఈమె అసలు పేరు షీలా. ఈమె చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాలలో డైటీషియన్ డిగ్రీ చేసింది. ఈమె నటిగానే కాకుండా మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నేపథ్య గాయనిగా కూడా పేరు సంపాదించింది. ఈమె 1995లో రచయిత, నటుడు, దర్శకుడు అయిన పొన్‌వన్నన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సినిమా జీవితం[మార్చు]

శరణ్య మణిరత్నం సినిమా నాయకుడు (తమిళంలో నాయగన్)తో సినిమా రంగంలోనికి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే కథానాయికగా అవకాశం దొరకడం, ఆ సినిమాలో ఈమె నటన బాగుండడంతో ఈమెకు 1980 దశకం చివరి నుండి పలు సినిమాలలో కథానాయికగా వరుసగా అవకాశాలు లభించాయి. 1995లో వివాహం తరువాత కొన్ని సంవత్సరాలు నటనకు విరామమిచ్చి 2003 నుండి తిరిగి క్యారెక్టర్ నటిగా సినిమాలలో నటిస్తున్నది. ఈమె నటనకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, ఒక జాతీయ చలనచిత్ర అవార్డ్ లభించింది. ఈమె 2014లో ఒక తమిళ సినిమాలో ఒక పాట కూడా పాడింది.

సినిమాల జాబితా[మార్చు]

శరణ్య నటించిన కొన్ని తెలుగు సినిమాలు:

  1. నాయకుడు (1987) - నీల
  2. ఆకర్షణ (1989)
  3. ఓ వర్షం కురిసిన రాత్రి (1989)
  4. నీరాజనం (1989)
  5. అంజలి (1990)
  6. సాహసం (1992)
  7. అప్పాజి (1996)
  8. చంటిగాడు (2003)
  9. రాఖీ (2006)
  10. జగడం (2007)
  11. దేవా (2007)
  12. విజేత (2007)
  13. పార్థు (2008)
  14. రెడీ (2008)
  15. 13 పదమూడు (2009)
  16. కొమరం పులి (2010)
  17. వేదం (2010) - పద్మ
  18. ప్రేమిస్తావా... (2010)
  19. చిరుత పులి (2011)
  20. పూర్ణా మార్కెట్ (2011)
  21. చారులత (2012)
  22. ఒకే ఒకే (2012)
  23. దండుపాళ్యం పోలీస్ (2013)
  24. ఇంద్రుడు (2014)
  25. మనం (2014)
  26. శీనుగాడి లవ్ స్టోరి (2015)
  27. రఘువరన్ B.Tech (2015)
  28. బ్రహ్మోత్సవం (2016)
  29. రెమో (2016)
  30. 24 (2016)
  31. విఐపి 2 (2017)
  32. కొలమావు కోకిల (తమిళ్) \ కోకోకోకిల (తెలుగు)
  33. మ‌గువ‌లు మాత్ర‌మే (2020)
  34. ముసలోడికి దసరా పండుగ

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]