43వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
43వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on30 నవంబరు 2012
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"అన్హే ఘోర్ దా డాన్"
Lifetime achievement"క్రిజిజ్టోఫ్ జానుస్సీ"

43వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2012 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] ఈ చిత్రోత్సవానికి ఆస్ట్రేలియా దర్శకుడు పాల్ కాక్స్ గౌరవ అతిథిగా పాల్గొన్నాడు. తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చిత్రోత్సవాన్ని ప్రారంభించాడు. శంకర్ మోహన్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.[2][3]

లైఫ్ అఫ్ పై సినిమా ప్రారంభోత్సవంలో విలేకరుల సమావేశంలో నటి టబు, నటుడు ఇర్ఫాన్ ఖాన్

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు[మార్చు]

  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: గుర్వీందర్ సింగ్ దర్శకత్వం వహించిన అన్హే ఘోర్ దా డాన్
  • ఉత్తమ దర్శకుడు: ది వెయిట్ సినిమా దర్శకుడు జియోన్ క్యూ-హ్వాన్
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: రోజ్ సినిమాలో నటించిన మార్సిన్ డోరోసియస్కి
  • ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: ఒబా నాథువా ఓబా ఎక్కా సినిమాలో నటించిన అంజలి పాటిల్

ప్రత్యేక అవార్డులు[మార్చు]

  • జీవన సాఫల్య పురస్కారం: క్రిజిజ్టోఫ్ జానుస్సీ
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: లూసీ ముల్లోయ్ - ఉనా నోచే సినిమా
  • సెంటెనరీ అవార్డు: మీరా నాయర్ - ది రెలుక్టంట్ ఫండమెంటలిస్ట్ సినిమా

అధికారిక ఎంపికలు[మార్చు]

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

ప్రారంభ సినిమా[మార్చు]

ముగింపు సినిమా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "International Film Festival of India". www.iffi.nic.in. Archived from the original on 2013-02-15. Retrieved 2021-06-29.
  2. "43rd IFFI closes with Meera Nair's 'The Reluctant Fundamentalist'". pib.nic.in.
  3. "IFFI: Zanussi to get lifetime achievement award".
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.

బయటి లింకులు[మార్చు]