44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 30 నవంబరు 2013 |
Hosted by | టిస్కా చోప్రా గుల్షన్ దేవయ్య |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | బీట్రిజ్ వార్ |
Lifetime achievement | జిరి మంజిల్ |
44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2013 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2][3][4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: లుయిగి అక్విస్టో, బెట్టీ రీస్ దర్శకత్వం వహించిన బీట్రిజ్ వార్
- ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ - అపుర్ పంచాలి సినిమా
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఎ ప్లేస్ ఇన్ హెవెన్ " సినిమాలో నటించిన అలోన్ అబుత్బుల్
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: ఇన్ హైడింగ్ సినిమాలో నటించిన మాగ్డలీనా బోజార్ స్కా
ప్రత్యేక అవార్డులు
[మార్చు]- జీవన సాఫల్య పురస్కారం: జిరి మంజిల్
- స్పెషల్ జ్యూరీ అవార్డు: ఓనూర్ ఒంకు తీసిన గిల్ట్ ది ఈవ్
- శతాబ్ది పురస్కారం: కమలేశ్వర్ ముఖర్జీ - మేఘే ధాకా తార (సినిమా)
- స్పెషల్ మెన్షన్: రోహిత్ శెట్టి
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: వహీదా రెహమాన్
మూలాలు
[మార్చు]- ↑ "'Beatriz's War' wins Golden Peacock at 44th International film festival of India - Times of India".
- ↑ "IFFI 2013 Winners - The Golden Peacock award goes to BEATRIZ's WAR." iffigoablog.blogspot.in.
- ↑ http://employmentnews.gov.in/IFFI.pdf
- ↑ http://pib.nic.in/newsite/feacontent.aspx?relid=100683
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.