45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 30 నవంబరు 2014 |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "లెవియాథన్" |
Lifetime achievement | "వాంగ్ కర్-వై" |
45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2014 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2] ఈ వేడుకలో చైనా కేంద్రంగా ఉంది.[3]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6] సినీనటి సీమా బిస్వాస్ జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది.[7]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఆండ్రీ జ్వ్యాగింట్సేవ్" దర్శకత్వం వహించిన "లెవియాథన్"
- ఉత్తమ చిత్రం: సిల్వర్ పీకాక్ అవార్డు: శ్రీహరి సాతే దర్శకత్వం వహించిన "ఏక్ హజరాచి నోట్"
- ఉత్తమ దర్శకుడు: "కిండర్ గార్టెన్ టీచర్" సినిమా దర్శకుడు నాదవ్ లాపిడ్
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "లెవియాథన్" సినిమాలో నటించిన అలెక్సీ సెరెబ్రియాకోవ్, "చోటోడర్ చోబి" సినిమాలో నటించిన దులాల్ సర్కార్.
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "బిహేవియర్" సినిమాలో నటించిన అలీనా రోడ్రిగెజ్, "కిండర్ గార్టెన్ టీచర్" సినిమాలో నటించిన సరిత్ లారీ
ప్రత్యేక అవార్డులు
[మార్చు]- జీవన సాఫల్య పురస్కారం: వాంగ్ కర్-వై
- శతాబ్ది: ప్రత్యేక జ్యూరీ అవార్డు: శ్రీహరి సాతే
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: రజినీకాంత్
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రత్యేక ప్రదర్శనలు
[మార్చు]ప్రారంభ సినిమా
[మార్చు]- మొహ్సేన్ మఖ్మల్‌బాఫ్ (ఇరాన్) దర్శకత్వం వహించిన ది ప్రెసిడెంట్
ముగింపు సినిమా
[మార్చు]- వాంగ్ కర్-వై (చైనా) దర్శకత్వం వహించిన గ్రాండ్ మాస్టర్
మూలాలు
[మార్చు]- ↑ "45th IFFI takes off at Goa tomorrow". pib.nic.in.
- ↑ "Russian film Leviathan wins Golden Peacock at IFFI 2014". 30 November 2014.
- ↑ "45th International Film Festival of India concluded in Goa". 1 December 2014.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ Pranjal Borah (21 November 2014). "Seema Biswas as Jury in 45th International Film Festival of India". KothaSobi. Archived from the original on 13 జనవరి 2021. Retrieved 22 November 2014.