46వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
46వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on30 నవంబరు 2015
Hosted byకబీర్ బేడి
లిల్లెట్ దుబే
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంఎంబ్రాస్ ఆఫ్ ది పెర్పెంట్
Lifetime achievementనికితా మిఖల్కోవ్

46వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] యుకె దర్శకుడు మైఖేల్ రాడ్‌ఫోర్డ్, పాలస్తీనాకు చెందిన ఇజ్రాయెల్ దర్శకురాలు శ్రీమతి సుహా అరాఫ్, జర్మన్ నటి జూలియా జెంట్స్, దక్షిణ కొరియా చిత్రనిర్మాత జియోన్ క్యూ-హ్వాన్ తదితరులు ఉన్న అంతర్జాతీయ జ్యూరీకి ఛైర్‌పర్సన్ శేఖర్ కపూర్‌ నాయకత్వం వహించాడు. 13 మంది సభ్యులున్న ఫీచర్ జ్యూరీకి చైర్‌పర్సన్ అరిబామ్ శ్యామ్ శర్మ నాయకత్వం వహించగా, 7 మంది సభ్యులున్న నాన్-ఫీచర్ జ్యూరీకి చైర్‌పర్సన్ రాజేంద్ర జంగ్లే నాయకత్వం వహించాడు.[2]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[3][4] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[5]

విజేతలు[మార్చు]

  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: సిరో గుర్రా దర్శకత్వం వహించిన ఎంబ్రాస్ ఆఫ్ ది పెర్పెంట్
  • ఉత్తమ దర్శకుడు: "ఐసెన్‌స్టెయిన్ ఇన్ గ్వానాజువాటో" సినిమా దర్శకుడు పీటర్ గ్రీన్వే
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ది మెజర్ ఆఫ్ ఎ మ్యాన్" సినిమాలో నటించిన విన్సెంట్ లిండన్
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ముస్తాంగ్" సినిమాలో నటించిన గున్స్ సెన్సోయ్, డోగా డోగుస్లు, తుగ్బా సుంగూరోగ్లు, ఎలిట్ ఎకాన్, ఇలేడా అక్డోగన్
  • ఐసిఎఫ్‌టి యునెస్కో గాంధీ పతకం: సినిమావాలా సినిమా దర్శకుడు కౌశిక్ గంగూలీ
  • జీవన సాఫల్య పురస్కారం: నికితా మిఖల్కోవ్ (ఆస్కార్ అవార్డు పొందిన రష్యన్ నటుడు-చిత్రనిర్మాత)
  • స్పెషల్ మెన్షన్: ఎన్క్లేవ్ (గోరన్ రాడోవావిక్)
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సీల్డ్ కార్గో (జూలియా వర్గాస్- వైస్)
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: ఇళయరాజా

అధికారిక ఎంపికలు[మార్చు]

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

ప్రారంభ సినిమా[మార్చు]

"ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ"

ముగింపు సినిమా[మార్చు]

"ది క్లాన్"

మూలాలు[మార్చు]

  1. "Key highlights of the 46th International Film Festival of India". pib.nic.in.
  2. Parande, Shweta (1 December 2015). "IFFI 2015: Award winners list at the 46th International Film Festival of India (In pics)".
  3. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  4. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  5. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.

బయటి లింకులు[మార్చు]