42వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
42వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented onనవంబరు 30, 2011
Hosted byరాహుల్ ఖన్నా
టిస్కా చోప్రా
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"పోర్ఫిరియో"
Lifetime achievement"బెర్ట్రాండ్ టావెర్నియర్"

42వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2011 నవంబరు 23 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] సినీ దర్శకుడు అడూర్ గోపాలక్రిష్ణన్ అంతర్జాతీయ పోటీ (ఫీచర్) కు అధ్యక్షత వహించగా, దర్శకుడు బసు భట్టాచార్య షార్ట్ ఫిల్మ్ పోటీకి అధ్యక్షత వహించాడు. కళా దర్శకుడు, తోట తరణి "డ్యాన్స్ నెమలి" ఫోటోతో తయారుచేసిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పోస్టర్ ను ఈ ఫెస్టివల్ లో విడుదల చేశారు.[2][3] ఈ ఫెస్టివల్ ప్రత్యేక సినిమాగా చిత్రనిర్మాత షాజీ కరుణ్ రూపొందించబడిన “కాలిడోస్కోప్” సినిమా ప్రదర్శనకాగా, 3 డి, యానిమేషన్, యూరోపియన్ ఆవిష్కరణలు, మాస్టర్ క్లాస్ సినిమాలు, రష్యన్ క్లాసిక్స్ వంటి కొత్త విభాగాలు కొత్తగా చేర్చబడ్డాయి. ఈ ఉత్సవానికి భారత సినీ నటుడు షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[4]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు:"అలెజాండ్రో లాండెస్" దర్శకత్వం వహించిన "పోర్ఫిరియో" సినిమా
  • ఉత్తమ దర్శకుడు: "నాడర్ అండ్ సిమిన్-ఎ సెపరేషన్" సినిమా దర్శకుడు అస్గర్ ఫర్హాది
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "రిస్టోరేషన్" సినిమాలో నటించిన సాసన్ గబాయి
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఎలెనా" సినిమాలో నటించిన నడేజ్డా మార్కినా

ప్రత్యేక అవార్డులు

[మార్చు]
  • జీవనసాఫల్య అవార్డు: "బెర్ట్రాండ్ టావెర్నియర్"
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు: "ఆడమింటే మకాన్ అబూ" సినిమా దర్శకుడు సలీం అహ్మద్

లఘు చిత్రాలకు అవార్డులు

[మార్చు]
  • వసుధ అవార్డు: కేఆర్ మనోజ్ - “ఎ పెస్టరింగ్ జర్నీ”
  • గోల్డెన్ లాంప్ ట్రీ రెండవ బహుమతి: స్మితా భిడే - “అనదర్ ప్లానెట్”
  • సిల్వర్ లాంప్ ట్రీ అవార్డు: మూల్ మోన్సన్ - “క్రేజీ బీట్స్ స్ట్రాంగ్ ఎవ్రీ టైమ్”
  • అంతర్జాతీయ జ్యూరీ బహుమతి: ఆశిష్ పాండే - “ఖులే దర్వాజ్”
  • ప్రత్యేక జ్యూరీ బహుమతి: అశోక్ రాణే - "ఆంథోనీ గోన్సోల్వ్స్"

అధికారిక ఎంపికలు

[మార్చు]

ప్రత్యేక ప్రదర్శనలు

[మార్చు]

ప్రారంభ సినిమా

[మార్చు]
  • లూక్ బెస్సన్ - “ది లేడీ”

ముగింపు సినిమా

[మార్చు]
  • ఫ్రాన్సిస్కో మాన్సో, జోవా కొరియా - "ది కాన్సుల్ ఆఫ్ బోర్డియక్స్"

మూలాలు

[మార్చు]
  1. "42nd International Film Festival of India". pib.nic.in.
  2. indiainfoline.com. "42nd International Film Festival of India launches its official poster".
  3. "42nd International Film Festival of India (IFFI) - Goa - 2011 - Shadow Play India". www.shadowplayindia.com. Archived from the original on 2021-06-29. Retrieved 2021-06-29.
  4. "International Film Festival of India". iffi.nic.in. Archived from the original on 2013-01-19. Retrieved 29 June 2021.
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.

బయటి లింకులు

[మార్చు]