41వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
41వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | డిసెంబరు 10, 2010 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "మోనర్ మనుష్" |
41వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2010 నవంబరు 22 నుండి 2010 డిసెంబరు 2 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] యష్ చోప్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[2] "కేన్స్ కాలిడోస్కోప్ 2010" అనేది 41వ చలన చిత్రోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫెస్టివల్ నుండి "ఉత్తమ నటి", "ఉత్తమ నటుడు" అవార్డులు మళ్ళీ ప్రారంభించారు. ఫ్రెంచ్ చిత్ర నిర్మాత ఎరిక్ రోహ్మెర్‌కు ఈ ఫెస్టివల్ నివాళులర్పించింది. అతడు తీసిన ఆరు సినిమాలు ఈ ఫెస్టివల్ లో ప్రదర్శన జరిగాయి.[3] ఒరియా సినిమారంగ ప్లాటినం జూబ్లీ జ్ఞాపకార్థంగా 26 సినిమాలను ప్రదర్శించారు. భారతీయ ఎడిషన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ జ్ఞాపకార్థం కూడా ఉంది.
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "గౌతమ్ ఘోష్" దర్శకత్వం వహించిన "మోనర్ మనుష్" (బెంగాలీ చిత్రం)
- ఐఎఫ్ఎప్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "లిటిల్ రోజ్ " సినిమాలో నటించిన "మాగ్డలీనా బోజార్ స్కా"
- ఐఎఫ్ఎప్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ది క్రాసింగ్" సినిమాలో నటించిన " గోవెన్ కోరాస్"
- స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "జస్ట్ అనదర్ లవ్ స్టోరీ" (భారతీయ సినిమా) నటించిన "కౌశిక్ గంగూలీ", "బాయ్" కివి సినిమాలో నటించిన "తైకా వెయిటిటి"
- ఐఎఫ్ఎప్ఐ ఉత్తమ దర్శకుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఇన్ ఎ బెటర్ వరల్డ్" (డానిష్ సినిమా) దర్శకుడు "సుసాన్ బీర్"[7]
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రత్యేక ప్రదర్శనలు
[మార్చు]ప్రారంభ సినిమా
[మార్చు]- "ఆండీ డి ఎమ్మోనీ" దర్శకత్వం వహించిన "వెస్ట్ ఈజ్ వెస్ట్" బ్రిటిష్ సినిమా[2]
ముగింపు సినిమా
[మార్చు]- "బెర్ట్రాండ్ టావెర్నియర్" దర్శకత్వం వహించిన "ది ప్రిన్సెస్ ఆఫ్ మోంట్పెన్సియర్" ఫ్రెంచ్ సినిమా.[8]
మూలాలు
[మార్చు]- ↑ "41st International Film Festival begins at GOA from 22nd November 2010". pib.nic.in.
- ↑ 2.0 2.1 "The ten-day 41st International Film Festival of India (IFFI) shall commence on November 22 at Goa. 'West is West' from UK is going to be the opening film of the festival. - Times of India".
- ↑ "41st International Film Festival of India opens at Goa". newsonair.nic.in. Archived from the original on 23 March 2018. Retrieved 29 June 2021.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ "India wins Golden Peacock after 10 yrs". Times of India. 3 December 2010. Retrieved 29 June 2021.
- ↑ "Tavernier film to close fest". 28 November 2010 – via www.thehindu.com.