మినోతి దేశాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మినోతి దేశాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మినోతి ఎన్. దేశాయ్
పుట్టిన తేదీ (1968-03-15) 1968 మార్చి 15 (వయసు 56)
ముంబై, గుజరాత్ కుచెందినది.
పెరిగింది ఇండోర్ మధ్య ప్రదేశ్
భారత దేశము
మారుపేరుఛోటీ, మేడీ, మోంటీ
ఎత్తు5 ft 8 in (1.73 m)
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుఎడమ చేతి స్పిన్
పాత్రబాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 31)1986 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 32)1986 జూన్ 22 - [[ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు|ఇంగ్లాండ్]] తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ -ODI
మ్యాచ్‌లు 1 1
చేసిన పరుగులు 56
బ్యాటింగు సగటు 28.00
100లు/50లు 0/1
అత్యధిక స్కోరు 54
వేసిన బంతులు 18
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28

మినోతి దేశాయ్ (జననం 1968 మార్చి 15) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి. ఈమె టెస్ట్ ఇంకా ఒక రోజు (వన్డే) అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి. ఆమె ముంబైలో జన్మించింది, కానీ గుజరాత్‌కు చెందినది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెరిగింది.[1]

ఆమె ఎడమచేతి వాటం బ్యాటింగ్ ఎడమచేతిని ఆర్థడాక్స్ బౌలింగ్ చేస్తుంది.[2] భారత దేశం తరఫున ఒక టెస్టు, ఒక వన్డే ఆట ఆడింది.[3]

వరిష్ఠ (సీనియర్) జాతీయ పోటీ (టోర్నమెంట్ ఫైనల్) చివరి ఆటలో అత్యధిక స్కోరు (150) సాధించి జాతీయ రికార్డును సాధించింది. 1988లో 'చెన్నై నేషనల్స్' భారత రైల్వేస్ తరఫున ఆడుతూ ఆమె కర్ణాటకపై 150 పరుగులు చేసింది.1985 - 1987 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు జూనియర్ జాతీయ మ్యాచ్లలో ఉత్తమ బ్యాట్స్ వుమన్ రికార్డు కూడా ఆమె సొంతం చేసుకుంది. ఆమె సీనియర్, జూనియర్ లు కలసిన భారతీయ విశ్వవిద్యాలయ (కంబైన్డ్ ఇండియన్ యూనివర్శిటీ) జట్లకు నాయకురాలిగా (కెప్టెన్) వ్యవహరించిన ఏకైక మహిళా క్రికెటర్. 1987లో ఆమె కెప్టెన్సీలో జూనియర్ కంబైన్డ్ యూనివర్శిటీ జట్టు 'కొట్టాయం నేషనల్స్' జాతీయ ఛాంపియన్ గా నిలిచింది.

ఆమె పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేసింది. ఆమె తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కు, కేంద్ర క్షేత్రం (సెంట్రల్ జోన్) కోసం ఆడటానికి 1992లో రైల్వేలను విడిచిపెట్టింది. ఆమె నాయకత్వంలో 1993లో ఢిల్లీలో జరిగిన సీనియర్ నేషనల్స్ పోటీలో మధ్య ప్రదేశ్ విజేతగా నిలిచింది. ఆమె 25 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నుండి విరమించుకుంది.

ఆమె ప్రస్తుతం గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు.[1]

మినోతి దేశాయ్ "షీ ది క్రికెటర్" అను పుస్తకం రాసింది.[4]

ఇతర లంకెలు[మార్చు]

ESPN Sports Media Ltd - https://www.espncricinfo.com/cricketers/minoti-desai-54243

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 "Minoti Desai". Blue Rose Publishers. Retrieved 31 July 2023.
  2. "Minoti Desai". CricketArchive. Retrieved 2009-09-18.
  3. "Minoti Desai". Cricinfo. Retrieved 2009-09-19.
  4. "Former India Cricketer Minoti Desai picks her Top 4 Semi-Finalists for World Cup 2022". Female Cricket Networks. 2 March 2022. Retrieved 30 July 2023.