మిలన్ (కళా దర్శకుడు)
మిలన్ ఫెర్నాండెజ్ | |
---|---|
జననం | 1969 |
మరణం | (aged 54) |
వృత్తి | ఆర్ట్ డైరెక్టర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005–2023 |
మిలన్ ఫెర్నాండెజ్ (1969 - 2023 అక్టోబరు 15) భారతీయ చలనచిత్ర కళా దర్శకుడు. ఆయన బిల్లా (2007), వేలాయుదం (2011), వేదాళం (2015) వంటి చిత్రాలకు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందాడు.[1][2]
తమిళ చిత్రాలతో పాటు మలయాళంలోనూ పని చేసే ఆయన తెలుగులో ఆక్సిజన్ (2017)చిత్రానికి కళా దర్శకుడుగా ఉన్నాడు.
కెరీర్
[మార్చు]మిలన్ 1999లో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌కి అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. సిటిజన్ (2001), తమిజన్ (2002), రెడ్ (2002), విలన్ (2002), అన్నియన్ (2005) వంటి చిత్రాలలో పనిచేశాడు. అన్నియన్ చిత్రం తెలుగులో అపరిచితుడుగా విడుదలైంది.[3][4][5]
30కి పైగా సినిమాలు, శక్తి మసాలా, ఆచీ మసాలా, ఆర్ ఎం కె వి, శరవణ స్టోర్స్, పోతీస్ వంటి 120 వాణిజ్య ప్రకటనలకు ఆయన కళా దర్శకుడుగా వ్యవహరించాడు.[6][7][8]
మరణం
[మార్చు]54 సంవత్సరాల వయస్సులో ఆయన 2023 అక్టోబరు 15న గుండెపోటుతో మరణించాడు.[9] అజిత్ కథానాయకుడుగా విడా ముయూర్చి సినిమా షూటింగ్ అజర్‌బైజాన్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఉన్న మిలన్ ఫెర్నాండెజ్ అస్వస్వత్థకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
మూలాలు
[మార్చు]- ↑ "Art director Milan says Tamil cinema will be proud of Ajith Kumar's Vivegam". Indiatvnews.com. Retrieved 29 November 2017.
- ↑ "Art director Milan speaks about Vivegam". Entertainment.chennaipatrika.com. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of 'Vivegam': Art director Milan". The Times of India. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of Vivegam: Art director Milan". Indianexpress.com. 23 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of 'Vivegam': Art director Milan - News Karnataka". M.dailyHunt.in. Retrieved 29 November 2017.
- ↑ Maria Mila (24 December 2015). "Art Director Milan Interview". YouTube. Retrieved 29 November 2017.
- ↑ "Art director Milan talks about Vivegam". Behindwoods.com. 22 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "Vivegam Making : Art Director Milan Interview - Official Trailer and Teaser". YouTube. 16 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం". Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)