Jump to content

మీనా కపూర్

వికీపీడియా నుండి
మీనా కపూర్
జననం1930
కోల్‌కతాలో (అప్పటి కలకత్తా)
మరణంనవంబరు 23, 2017
మరణ కారణంపక్షవాతం
జాతీయతబారతీయురాలు
వృత్తినేపథ్య గాయని

మీనా కపూర్ (1930 - 2017 నవంబరు 23) భారతీయ నేపథ్య గాయని.[1] ఆమె న్యూ థియేటర్స్ స్టూడియోకు చెందిన నటుడు బిక్రమ్ కపూర్ కుమార్తె. ఆమె కుటుంబానికి ప్రముఖ చిత్రనిర్మాత పిసి బారువా సన్నిహితుడు.

కెరీర్

[మార్చు]

ఆమె గానం చిన్న వయసులోనే నిను మజుందార్, ఎస్.డి బర్మన్ వంటి స్వరకర్తలచే గుర్తించబడింది. ఆమె 1940లు, 1950లలో హిందీ చలనచిత్రసీమలో నేపథ్య గాయని. పరదేశి (1957)లోని రసియా రే మన్ బసియా రే, అధికార్ (1954) లోని ఏక్ ధర్తీ హై ఏక్ గగన్ వంటి హిట్‌లను ఆమె అందించింది. చార్ దిల్ చార్ రహెన్ (1959)లో మీనా కుమారితో చిత్రీకరించిన కచ్చి హై ఉమారియా పాట ఆమెకు మంచి గుర్తింపుతెచ్చిపెట్టింది.[2]

ఆమె పాడిన పాటలలో అత్యంత ప్రసిద్ధిచెందిన వాటిలో ఒకటి ఆనా మేరీ జాన్ సండే కే సండే, ఇది షెహనాయ్ (1947) చిత్రం నుండి సి. రామచంద్ర, శంషాద్ బేగంతో యుగళగీతం. అలాగే చోటి చోటి బాతేన్ (1965) చిత్రంలోని కుచ్ ఔర్ జమానా కెహతా హై, ఇది అనిల్ బిశ్వాస్ ట్యూన్ చేసాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
ఆగోష్
దుఖియారి
హరిదర్శన్
గోపీనాథ్
ఆకాష్
నైనా
ఉషా కిరణ్
డోర్ చలెన్
చోటీ చోటీ బాతేన్
చల్తే చల్తే
పరదేశి (1957)
నా ఇల్లు (1953)
ఘయల్ (1951)
ఆది రాత్ (1950)
అనోఖా ప్యార్ (1948)
ఘర్ కి ఇజ్జత్ (1948)
నై రీత్ (1948)
షెహనాయ్ (1947)

వ్యక్తిగతం

[మార్చు]

ఆమె 1959లో సంగీత స్వరకర్త అనిల్ బిస్వాస్‌ను వివాహం చేసుకుంది, తర్వాత హిందీ సినిమాని విడిచిపెట్టి, మార్చి 1963లో ఆల్ ఇండియా రేడియో (AIR)లో నేషనల్ ఆర్కెస్ట్రా డైరెక్టర్‌గా ఢిల్లీకి మారారు.[3] అనిల్ బిస్వాస్ మే 2003లో ఢిల్లీలో మరణించారు. పిల్లలు లేరు. కానీ అనిల్ బిస్వాస్‌కు అతని మొదటి భార్య ఆశాలతా బిస్వాస్ (మెహ్రున్నీసా)తో నలుగురు పిల్లలు ఉన్నారు.

మరణం

[మార్చు]

కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న మీనా కపూర్ 2017 నవంబరు 23న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచింది.

మూలాలు

[మార్చు]
  1. "Singer Meena Kapoor passes away". The India Times. Retrieved 13 August 2019.
  2. Raheja, Dinesh (9 February 2004). "Anilji and I were like lovebirds". ExpressIndia. Retrieved 21 August 2011.[dead link]
  3. Anil Biswas, 89, Whose Music Used Orchestras in Indian Films New York Times, 4 June 2003.