మీర్జా రియాజ్ ఉల్ హసన్
| మీర్జా రియాజ్ ఉల్ హసన్ | |||
| పదవీ కాలం 2025 ఏప్రిల్ 25 - ప్రస్తుతం | |||
| పదవీ కాలం 2019 మార్చి 30 - 2025 మార్చి 29 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
|---|---|---|---|
| జననం | 1977 జూలై 26 హైదరాబాదు, తెలంగాణ | ||
| రాజకీయ పార్టీ | ఎఐఎంఐఎం | ||
| తల్లిదండ్రులు | మీర్జా సయీదుల్ హసన్ పర్వేజ్ ఎఫెండి, ఖదీజా బేగం ఎఫెండి | ||
| జీవిత భాగస్వామి | షబానా అలీ | ||
| సంతానం | ఇద్దరు కుమార్తెలు | ||
| నివాసం | మలక్‌పేట | ||
మీర్జా రియాజ్ ఉల్ హసన్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఎఐఎంఐఎం తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1][2] 2016లో హైదరాబాదు మహానగర పాలక సంస్థలోని డబీర్‌పురా వార్డు (నం: 30) కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు.[3][4]
జీవిత విషయాలు
[మార్చు]హసన్ 1977, జూలై 26న మీర్జా సయీదుల్ హసన్ పర్వేజ్ ఎఫెండి, ఖదీజా బేగం ఎఫెండి దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. బికాం వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]హసన్ కు షబానా అలీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
రాజకీయరంగం
[మార్చు]హసన్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2009లో నూర్‌ఖాన్‌బజార్ డివిజన్ కార్పొరేటర్‌గా, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.[5] రెండుసార్లు హైదరాబాదు మహానగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2019 మార్చి 30న శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]
మీర్జా రియాజ్ ఉల్ హాసన్ 2025లో జరిగిన శాసనసమండలి ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై గెలిచాడు.[8] మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు 63 ఓట్లు వచ్చాయి, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి.[9]
ఇతర వివరాలు
[మార్చు]ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Telangana-Legislature, MLCs (4 August 2021). "Members Information - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 4 August 2021. Retrieved 6 August 2021.
- ↑ IANS (2019-03-12). "Telangana Home Minister among 5 elected to Council". Business Standard India. Retrieved 6 August 2021.
- ↑ Mahesh, Koride (8 April 2009). "Baldia beginning to these MLC, MP netas". The Times of India. Archived from the original on 10 May 2011.
- ↑ "Archived copy". Archived from the original on 23 February 2017. Retrieved 6 August 2021.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ Janyala, Sreenivas (15 April 2009). "After 40 yrs, MIM on shaky ground". The Indian Express. Archived from the original on 10 May 2011.
- ↑ "Telangana MLC polls: Home Minister among 4 TRS candidates elected to state Council". The News Minute (in ఇంగ్లీష్). 2019-03-13. Retrieved 6 August 2021.
- ↑ "TRS, MIM candidates win MLC polls as expected". The Hindu (in Indian English). Special Correspondent. 2019-03-12. ISSN 0971-751X. Retrieved 6 August 2021.
{{cite news}}: CS1 maint: others (link) - ↑ "ఎంఐఎం ఖాతాలోకి 'హైదరాబాద్ స్థానిక' ఎమ్మెల్సీ". Eenadu. 26 April 2025. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
- ↑ "హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు". Eenadu. 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.