Jump to content

మీ సేవ (తెలంగాణ)

వికీపీడియా నుండి
మీ సేవ
ప్రాంతంతెలంగాణ
దేశంభారతదేశం
మంత్రిత్వ శాఖతెలంగాణ ఐటిశాఖ
ప్రధాన వ్యక్తులుకల్వకుంట్ల తారక రామారావు, ఐటిశాఖ మంత్రి
జయేష్ రంజన్, ఐటిశాఖ కార్యదర్శి
జిటి వెంకటేశ్వర్ రావు, కమీషనర్ (మీ సేవ)
ప్రారంభం2 జూన్, 2014

మీ సేవ అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన ఆన్‌లైన్‌ సేవాకేంద్రం. మీ సేవ కేంద్రాలలో 150కి పైగా ప్రభుత్వ, 600 ప్రైవేట్ సంబంధిత ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించడుతున్నాయి.[1][2] 2018 ఫిబ్రవరిలో ఈ సేవ ద్వారా 10 కోట్ల లావాదేవీలను పూర్తి చేయబడ్డాయి. రాష్ట్ర ఏర్పాటు తరువాత డిజిటల్ లావాదేవీల విభాగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.[3] ఇందులోని సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ (టిఎస్‌టిఎస్) అభివృద్ధి చేసి, సహకరిస్తోంది.

చరిత్ర

[మార్చు]

2011, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మీ సేవ ప్రారంభించబడింది. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, దీని సేవలు విభజించబడ్డాయి.[4]

సేవలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల్లోని 4758 ఫ్రాంచైజ్ కేంద్రాల్లో ఈ సేవ ద్వారా ఆన్‌లైన్‌ సేవలను అందిస్తున్నారు.[5] ఇందులో 10 శాతం లాభం ప్రభుత్వానికి, 90 శాతం లాభం లైసెన్స్ పొందిన ఫ్రాంచైజీకి వెళుతుంది.

2018, ఏప్రిల్ 12న పట్టాదారు పాస్ బుక్ లకు ఆధార్ సీడింగ్ నేను మీ సేవ సర్వీసు ప్రొవైడర్స్ కు ఇవ్వబడింది. ఈ సేవ కేంద్రాలలో ఈకెవైసీ పద్ధతిని ఉపయోగించి ఆధార్ ఖాతాకు బయోమెట్రిక్‌లను నవీకరించవచ్చు.

టి యాప్ ఫోలియో

[మార్చు]

మీ సేవా 2.0లో భాగంగా మొబైల్ వినియోగదారులకోసం ఒక యాప్ తయారుచేశారు. ఈ యాప్ లో 180 సేవలు, మీ సేవా సేవలు, ఆర్టీఏ సేవలు, ఫీజు చెల్లింపులు, బిల్ చెల్లింపు వంటి సేవలు అందిస్తున్నారు. 2018, ఫిబ్రవరి 28న తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ఈ యాప్ ను ప్రారంభించాడు.[6] భారత ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ మాదిరిగానే టి యాప్ ఫోలియో ఉంటుంది. ఈ యాప్ సమాచార సేవలు, మీసేవా కేంద్రాలు, రేషన్ షాపులు, హై-ఫై హాట్‌స్పాట్‌ల వంటి స్థాన సేవలను కూడా అందిస్తుంది.

అవార్డులు

[మార్చు]
  • 2018, ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఐటిలో విట్సా చైర్మన్ అవార్డు.[7]

మూలాలు

[మార్చు]
  1. Insights from Telangana Govt.'s MeeSeva Platform Going Mobile - CIOL
  2. Telangana's Mee Seva, HawkEye in Hall of Fame
  3. TS is on top in country in digital transactions: KTR
  4. "Mee Seva services to help speed up passport issue". The Hindu. 6 May 2017. Retrieved 17 June 2019.
  5. http://www.newindianexpress.com/states/telangana/2017/sep/30/officials-fail-to-act-as-mee-seva-franchisees-fleece-customers-1664729.html
  6. https://economictimes.indiatimes.com/tech/software/telangana-launches-integrated-app-for-all-government-services/articleshow/63114771.cms
  7. Telangana MeeSeva bags award at WCIT

బయటి లింకులు

[మార్చు]