మురుగశంకరి లియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మురుగశంకరి లియో, ప్రముఖ భరతనాట్య కళాకారిణి, నాటక కళాకారిణి, పరిశోధక విద్యార్థి. ఆమె భరతనాట్య గురువు కూడా. భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఆమె ఎన్నో భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. మురుగశంకరి చెన్నైలో కలై కూడం పేర భరతనాట్య పాఠశాల నడుపుతోంది. ఆమె కర్ణాటక సంగీతం, నట్టువంగం కూడా నేర్చుకుంది.

పాట పాడుతూ, నట్టువంగం చేస్తూ, నృత్యం నేర్పించే అతి తక్కువ నాట్య గురువుల్లో మురుగుశంకరి ఒకరు. మధురైలోని మీనాక్షీ ఆశ్రంలో శివానంద సంప్రదాయానికి చెందిన యోగా నేర్పిస్తుంటుంది ఆమె. ఆమె నాట్యాన్ని ఎందరో భరతనాట్య ప్రముఖులు, పత్రికలు ప్రసంసించాయి.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

మురుగశంకరిది తండ్రి లియో ప్రభు ప్రముఖ రంగస్థల నటుడు, టీవీ పర్సనాలిటీ, తమిళ సినిమాల్లో నిన్నటి తరం నటుడు కూడా. రెండుం రెండుం అంజు, నాన్ మహాన్ అల్లా, అన్నే అన్నే వంటి సినిమాల్లో నటించాడు ప్రభు. ప్రభుకు కలైమామణి పురస్కారం కూడా లభించింది.

చెన్నైలోని ఆదర్ష్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రాథమిక విద్యనభ్యసించింది మురుగశంకరి. శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది ఆమె.

నాట్య కెరీర్[మార్చు]

బెంగుళూరులోని ఒక నృత్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న మురుగశంకరి

ఆమె 5వ ఏట నాట్య గురువు కె.జె.సరస వద్ద నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది మురుగశంకరి. ఘంటశాల పార్వతి రవి నేతృత్వంలో అరంగేట్రం చేసింది ఆమె. కెమికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేసిన ఆమె, భరతనాట్యంలో భరతిదశన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె భరతనాట్యంలో పరిశోధన చేస్తోంద్.

ప్రముఖ ప్రదర్శనలు[మార్చు]

మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రతిష్ఠాత్మకమైన సభల్లో ఆమె నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.[2][3]

మధురై మీనాక్షీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో నాట్య ప్రదర్శన ఇస్తున్న మురుగశంకరి.
 • చిదంబరం నాట్యాంజలి
 • తమిళనాడు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మామళ్ళపురం నృత్య ఉత్సవాలు
 • దర్పణ, డబ్ల్యూ.జెడ్.సి.సి ఆధ్వర్యంలో అహ్మదాబాద్లో నటరాణి ఉత్సవాలు.
 • కలకత్తాలో ఉదయ శంకర్ ఉత్సవాలు.
 • తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే నాథనీరాజనంలో మూడుసార్లు ప్రదర్శన.
 • మలేషియా, పెనాంగ్, షా అలం, కపార్ లలో చారిటీ ప్రదర్శనలు.

అవార్డులు[మార్చు]

హైదరాబాద్ లోని ఒక ప్రదర్శనలో మురుగశంకరి.
 • విపంచి ట్రస్ట్, నాట్యకళ విపంచి అనే అవార్డు ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతి నుండి అందుకొంది.
 • కటక్లోని ఉత్కళ యువ సంస్కృతిక్ సంగ్, నృత్య శిరోమణి పురస్కారం ఇచ్చి గౌరవించింది.
 • విశాఖపట్టణంలో నటరాజ సంగీత, నృత్య అకాడమీ, ప్రపంచ నృత్య దినోత్సవ పురస్కారంతో సత్కరించింది.
 • ఆమెను ఒడిశా పర్యాటక శాఖ 2012లో పరిచయ్ జాతీయ ఎక్సెలన్సీ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
 • మలేషియాలో నాట్య తిలకం బిరుదుతో గౌరవం జరిగింది.
 • 2012లో చెన్నైలో సలంగై ఓలీ ట్రస్టు నర్తన శిరోమణి బిరుదుతో ఆమెను సత్కరించింది.
 • 2012లో పార్ధసారథి స్వామి సభలో ఉత్తమ ప్రదర్శకురాలిగా నిలిచింది మురుగశంకరి.
 • భారతీయ లలిత కళల సొసైటీ నిర్వహించిన దక్షిణ జోన్ సంగీత, నృత్య కాన్ఫరెన్స్ లో ఉత్తమ నాట్య కళాకారిణిగా ఎంపికైంది ఆమె.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-15. Retrieved 2017-04-17.
 2. "ది హిందూ". ది హిందూ.
 3. "ఇండియన్ ఎక్స్ ప్రెస్".