ములుకనాడు బ్రాహ్మణులు
మతం | |
---|---|
హిందూ మతం లోని స్మార్తం సంప్రదాయం పాటిస్తారు. |
తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో ములుకనాడు బ్రాహ్మణులు ఒక ఉపసమూహం. ఈ వర్గాన్నే మురికినాడు, ములుక్నాడు, ములుకనాడు, ములకనాడు, మూలకనాడు, ములికినాడు అని రకరకాలుగా పిలుస్తారు.
పద చరిత్ర
[మార్చు]దక్షిణాది భాషలలో నాడు అంటే దేశం అని, ఇంకో అర్థంలో కాలం అని కూడా అర్థం. ములుకనాడులో "నాడు" అంటే, "ములుక నేలకు చెందిన ప్రజలు" అని అర్థం. తెలుగులో ఆనాడు, ఈనాడు, మరునాడు ఇలా కాలాన్ని చెప్పడానికి, రేనాడు, పలనాడు ఇలా ప్రాంతాలకి కూడా వాడుతారు. శాతవాహనుల కాలంలో ములుక లేదా ములక పదం అస్మాకాతో పాటు మూలక, మూలక దేశంగా వాడబడిందని తెలుస్తోంది.[1] ఔరంగాబాద్, నాశిక్, జల్నా, వశిం ములకలోని భాగాలు. ఈ ములక దేశానికి ప్రతిస్థానపురం అనగా ప్రస్తుత మహారాష్ట్ర లోని పైథాన్ రాజధాని.[2][3]
ఈ ములుకనాడు గురించి, దాని మూలాలు, పద్దతులు, సంస్కృతుల గురించి టి. వి. వెంకటాచల శాస్త్రి అధ్యయనం చేశాడు.
పేరు పుట్టుక
[మార్చు]ఈ ప్రాంతాలలో దొరికిన వేర్వేరు శాసనాల ఆధారంగా ములుకనాడు వివిధ రకాలుగా పిలువబడేది. ములకనాడు బ్రాహ్మణుల మూలాల కోసం అన్వేషిస్తే ఈ వర్గం కడప జిల్లాలోని పెన్నా నది కేంద్ర పరీవాహక ప్రాంతానికి చెందిన తెలుగు వారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతం వివిధ కాలాల్లో వివిధ పేర్లతో వ్యవహరించబడింది. పుణ్య కుమారుడు ఈ దొమ్మరనంద్యాల ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రంగా ప్రస్తావించాడు. మొట్టమొదటగా ఈ ముల్కినాడు ప్రాంతం గురించి అధికంగా పుష్పగిరి లోని శాసనాల ద్వారా రాష్ట్రకూట రాజు అయిన కృష్ణుడు ద్వారా ముల్కినాడు నాయుడు మహారాజ్యంగా అధికంగా ప్రస్తావించబడింది.[4] ఈ ప్రాంతం ముల్కినాడుతో పాటు ఈ ప్రాంతములోని కొన్ని ప్రాంతాలు రేనాడు, మార్జావడి, పొత్తాపినాడు, పెదనాడు మొదలగు విధములుగా పిలువబడినాయి.
1214 శకం(1292 CE)లో కాయస్థ అంబదేవుని (కాకతీయుల రుద్రమదేవి పాలనలో దక్షిణ ఆంధ్ర సామంత పాలకుడు) ఇంకొన్ని శాసనాలలో ముల్కినాడుతో పాటుగా పులివెండ్ల (ప్రస్తుత పులివెందుల), పొత్తాపి, పెనావది, సిరివోడు లను ప్రస్తావించారు.[4]
1289 CE నుండి 1323 CE వరకు పరిపాలించిన కాకతీయ ప్రతాప రుద్రుడు 1319 CE లో కడప జిల్లాలోని సిద్దవటం లోని చందువోయి శాసనం లో ముల్కినాడు గురించి పేర్కొన్నాడు.[5] పలు శాసనాలు, సమీప ప్రాంతాల చరిత్రలు పరిశీలించిన మీదట కడప ప్రాంతంకి ములుకనాడు లేదా ముల్కినాడు చెందినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-29. Retrieved 2020-05-28.
- ↑ Sastri, S. Srikanta. ""Mulakas" (Origins of Mulukanadu Sect)". Article. Quarterly Journal of Mythic Society. Archived from the original on 14 జనవరి 2019. Retrieved 28 May 2020.
- ↑ Sastry, T. V. Venkatachala (2000). "Mulukanadu Brahmanaru". Bangalore: Mulukanadu Mahasangha.
- ↑ 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-06. Retrieved 2020-05-28.
- ↑ "Full text of "7 నుండి 11 వరకు పురాతన దక్కను చరిత్ర "". archive.org (in ఇంగ్లీష్). Retrieved 28 May 2020.