Coordinates: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E / 16.5; 80.8

ముస్తాబాద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముస్తాబాద
—  రెవెన్యూ గ్రామం  —
ముస్తాబాద is located in Andhra Pradesh
ముస్తాబాద
ముస్తాబాద
అక్షాంశరేఖాంశాలు: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E / 16.5; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521107
ఎస్.టి.డి కోడ్ 08676

ముస్తాబాద : కృష్ణా జిల్లా గన్నవరం మండలం లోని ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 521 107 ., ఎస్.టి.డి.కోడ్ = 8676.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

రెవెన్యూ రికార్డుల ప్ర్రకారము దీనిని వెదురుపావులూరు అని అంటారు.

గ్రామ భొగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

ఈ ఊరు విజయవాడకు చాలా దగ్గర. ఈ ఊరి ప్రజలు అన్నిటికి విజయవాడపై ఆధారపడటం వలన ఎక్కువ అభివృద్ధిని సాధించలేకపోయారు. గ్రామంలో నీటి కొరత ఎక్కువే.

సమీప గ్రామాలు[మార్చు]

విజయవాడ, మంగళగిరి, హనుమాను జంక్షన్, నూజివీడు

సమీప మండలాలు[మార్చు]

విజయవాడ, విజయవాడ గ్రామీణ, పెనమలూరు, కంకిపాడు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాల ప్రాంగణంలో శ్రీ కడియాల వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతుల ఙాపకార్ధం, వారి వారసులు శ్రీ కడియాల రాఘవరావు, విజయలక్ష్మి గార్ల, రెండు లక్షల రూపాయల గార్ల ఆర్థిక సహకారంతో, నిర్మించిన నీటిశుద్ధి పథకాన్ని, 2015, ఆగస్టు-24వ తేదీనాడు ప్రారంభించెదరు. [3]
  2. విజయవాడ కె.బి.ఎన్.కళాశాల ప్రాంగణంలో, 2015, సెప్టెంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, రాష్ట్రస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలలో ఈ పాఠశాలలో చదువుచున్న పులపాక మనోజ్ కుమార్ అను విద్యార్థి ప్రదర్శించిన, "పట్టిసీమ - రాయలసీమకు వరం" అను ప్రాజెక్టు, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈ విద్యార్థికి ఇక్కడ ఈ మేరకు ఒక ఒక ధ్రువపత్రాన్నీ, ఒక ఙాపికనూ అందజేసినారు. ఈ ప్రాజెక్టు త్వరలో ఢిల్లీ ఐ.ఐ.టిలో నిర్వహించు జాతీయ స్థాయి ప్రదర్శనలలో ప్రదర్శించెదరు. [4]

పులపాక మనోజ్ కుమార్ ఢిల్లీ ఐ.ఐ.టిలో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొని భారత ప్రధాని శ్రీ.నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, సుజనా చౌదరి ల ప్రశంశలు పొందారు.భారత రాష్ర్టపతి భవన్ లోకి వెళ్ళడానికి 163మంది పోటీపడగా ఆంధ్రప్రదేశ్ నుండి అర్హత సాధించిన ఏకైక విద్యార్థి పులపాక మనోజ్ కుమార్.కేవలం 2 మార్కులతో మనోజ్ కుమార్ జాతీయ స్థాయి ప్రదర్శనలో ఓటమిపాలయ్యాడు.అప్పటివరకు పులపాక మనోజ్ కుమార్ ప్రదర్శన జాతీయ స్థాయిలో విజయం సాధించాడన్న ఆనందంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట బృందం ఉండగా ఒక్కసారిగా మనోజ్ ఓటమిపాలయ్యాడన్న విషయం తెలియడంతో ఆందోళనకు దిగారు.దీంతో కేంద్రమంత్రి సుజనా చౌదరి శాంత పరచి ఐ.ఐ.టి ఛైర్మన్ తో మాట్లాడి మనోజ్ కుమార్ తో ఐ.ఐ.టి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించే అవకాశం ఇప్పించారు.దీంతో అక్కడ మనోజ్ కుమార్ వివరించిన తీరును చూసి ఐ.ఐ.టి చైర్మన్ సైతం ప్రశంశల వర్షం కురిపించారు.రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చంనాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల ప్రశంశలు పులపాక మనోజ్ కుమార్ ను వరించాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా పులపాక మనోజ్ కుమార్ కు 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా వాటిని సైతం అమరావతి అభివృద్ధికి విరాళంగా మనోజ్ కుమార్ ప్రకటించాడు.దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పులపాక మనోజ్ కుమార్ ను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.[5] ఇందులో తన గొప్పేమీ లేదని ఉపాధ్యాయులు నంబూరు హైమావతి, సునీత, బోయపాటి శ్రీనివాసరావుల కృషి, హెచ్.ఎమ్. వెంకటేశ్వరరావు ప్రోత్సాహం, తల్లిదండ్రుల దీవెన, దేవుని దయ తోనే ఇదంతా సాధించానని మనోజ్ కుమార్ ప్రకటించాడు.[6]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామంలో, రు. 1.88 కోట్లతో నిర్మించనున్న విద్యుత్తు ఉపకేంద్రానికి, 2013 నవంబరు 22 నాడు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే, ఈ గ్రామంతోపాటు, పురుషోత్తమపత్నం, సావరగూడెం, వీరపనేనిగూడెం, కొండపావులూరు గ్రామాలలోని ఇళ్ళు, వ్యవసాయానికి సంబంధించిన 4,500 విద్యుత్తు కనక్షన్లకు లో-వోల్టేజ్ సమస్య ఉండదు. [1]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. వెదురుపావులూరు గ్రామం, ముస్తాబాద గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో ఈ ముస్తాబాద గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కైలే ఆదిలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామంలోని పల్లెలు/ప్రాంతాలు[మార్చు]

ఈ ఊరిలో చిన్నమాలపల్లి, పెద్దమాలపల్లి, వెదురుపావులూరు, ముస్తాబాద అనే ప్రాంతములు ఉన్నాయి.

గ్రామంలోని ప్రదేశాలు[మార్చు]

ఈ ఊరిలో పెద్ద చెరువు, పెద్ద చెరువు, శివాలయము, ఉన్నత పాఠశాల, కొండ, మంచి నీటి బావి మొదలగునవి ముఖ్యమైన ప్రదేశములు.

పరిశ్రమలు[మార్చు]

వ్యవసాధారిత గ్రామం. కోళ్ళపరిశ్రమ బాగానే జరుగుతున్నది. రోజువారీ పనులకు ప్రజలు విజయవాడకు వెళ్తుంటారు.

గ్రామ జనాభా[మార్చు]

గ్రామ జనాభా 11,000. ఇందులో దాదాపు 1000మంది రైల్వే ఉద్యోగులు గలరు. గ్రామంలో దాదాపు 24 కులాలకు చెందినవారు నివసిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "onefivenine.com/india/villages/Krishna/Gannavaram/Mustabad". Archived from the original on 29 జూన్ 2016. Retrieved 19 June 2016.

[1] ఈనాడు విజయవాడ; 2013, నవంబరు-23; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2013, డిసెంబరు-29; 5వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-24; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-24; 15వపేజీ.