Jump to content

మూసా రజా

వికీపీడియా నుండి
మూసా రజా
జననం(1937-02-27)1937 ఫిబ్రవరి 27
మీనంబూర్, సౌత్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ (మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2024 మే 8(2024-05-08) (వయసు 87)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిపౌర సేవకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1958–2024
జీవిత భాగస్వామిహుస్నారా రజా
పిల్లలు4

మూసా రజా (1937 ఫిబ్రవరి 27 - 2024 మే 8) ఆరు విద్యా సంస్థలను నడుపుతున్న సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (S.I.E.T.)కి ఛైర్మన్‌గా ఉన్న భారతీయ పౌర సేవకుడు.[1] ఆయన కోస్టల్ ఎనర్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కూడా ఛైర్మన్‌గా ఉన్నాడు.[2] ఆయన ఆఫ్ నవాబ్స్ అండ్ నైటింగేల్స్ (Of Nawabs and Nightingales)అనే విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన పుస్తకాన్ని రాశాడు.[3]

మూసా రజా 2010 సంవత్సరానికి పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించబడ్డాడు. ఆయన 1960లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ (IAS)లో చేరాడు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌కు సలహాదారుగా, ఢిల్లీలో క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ఉక్కు మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసాడు.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

మూసా రజా 1937 ఫిబ్రవరి 27న తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని మీనంబూర్‌లో గులాం అలీ మెహకారీ, ఆసియా బేగం దంపతులకు జన్మించాడు. ఆయన 8 సంవత్సరాల వయస్సు వరకు స్థానిక గ్రామ పాఠశాలలో ఉర్దూ, అరబిక్ చదివాడు, ఆ తర్వాత అతను తన కుటుంబంతో సహా చెన్నైకి వెళ్లాడు. అక్కడ, ఆయన మదర్సా-ఎ-అజం అనే పాఠశాలలో చదువుకున్నాడు. 1955లో అప్పటి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (ప్రస్తుతం క్వాయిడ్-ఇ-మిల్లత్ కళాశాలగా మారింది) నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

1958లో, ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, (ప్రస్తుతం ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై) మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల భాష సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పట్టభద్రుడయ్యాడు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తన సొంత డిపార్ట్‌మెంట్‌లోనే కాకుండా హిస్టరీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ విభాగాల నుంచి కూడా ఏడు మెడల్స్ సాధించాడు. ఆయన విశ్వవిద్యాలయం నుండి ట్రిపుల్ గోల్డ్ మెడల్ విజేతగా నిలిచాడు. ఈ ఘనత ఇప్పటికి రికార్డ్ అవడం విశేషం. ఆయన అదే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తిచేసాడు.

1958లో అప్పటి వైస్-ఛాన్సలర్ సర్ లక్ష్మణ్ స్వామి ముదలియార్ ఆయనను ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించాడు. అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఆయన 1960లో మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన హుస్నారాను వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పురస్కారాలు

[మార్చు]

2010లో రిపబ్లిక్ డే ఆనర్స్‌లో ఆయనకు భారతదేశంలోని ప్రతిష్టాత్మక పురస్కారం పద్మభూషణ్ లభించింది. ఆయన ఉద్యోగంలో ఉన్న సమయంలో రాష్ట్రపతి రజత పతకం, శిరోమణి అవార్డు, ఇందిరా ప్రియదర్శిని అవార్డు, జువెల్ ఆఫ్ ఇండియా అవార్డు, ప్రైడ్‌ ఆఫ్ ఇండియా అవార్డు వంటి అనేక ఇతర పురస్కారాలు అందుకున్నాడు.

మరణం

[మార్చు]

మూసా రజా 2024 మే 8న 87 సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu Feb 08, 2010 – Metro Plus – A little-known award winner
  2. chennaivision – Moosa Raza to receive Padma Bhushan Award Archived 9 జూన్ 2011 at the Wayback Machine
  3. The Milli Gazette – Interview – ‘We want to arouse the consciousness’
  4. The Hindu 8 February 2010 – Metro Plus – A little-known award winner S. MUTHIAH /2010020851370600.htm
  5. Moosa Raza, Jammu Kashmir CS of 1990s Is No More
"https://te.wikipedia.org/w/index.php?title=మూసా_రజా&oldid=4216889" నుండి వెలికితీశారు