మూస చర్చ:Cite kavyam
సైట్ మూస గురించి
[మార్చు]సైట్ చేసేందుకు వస్తున్న బటన్ చాలా ఉపయుక్తంగా ఉంది. చేర్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను కొందరు కవుల గురించి వ్రాస్తూంటే తెలుగువారికి సైట్ బుక్, సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ జర్నల్ టెంప్లెట్లే కాక మరొకటి అవసరమని తెలుస్తోంది. మన పద్యాలను పూర్వం పండితులు కోట్ చేసేప్పుడు కుమారసంభవం 8వ ఆశ్వాసం 135 పద్యం వగైరా విధంగా ఇచ్చేవారు. ఆశ్వాసమో, స్కంధమో, కాండమో ఏదోకటి ఉండి పద్యసంఖ్య సహా ఇస్తే వీలుగా వుంటుంది. మనం ఈ టెంప్లెట్లలో అలా పద్యాలను సైట్ చేసేందుకు కూడా వీలైన విధానం తయారుచేసుకుంటే బావుంటుందనిపిస్తోంది. దీనికి తగ్గ సాంకేతిక విషయంలో సహకారం చేస్తానంటే నేను అదెలా ఉండొచ్చో నా ఊహ నేను చెప్తాను. దీనిపై వెంకటరమణ గారు వంటి వారు కూడా సహకరిస్తే బావుంటుంది. ఏమంటారో తెలియజేయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 06:17, 7 డిసెంబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అలాగే, తప్పకుండా సహాయం చేయగలను. ఈ మూసలో ఏఏ ఫీల్డులు ఉండాలో తెలియజేస్తే తదనుగుణంగా మూసను తయారుచేసి, సైట్ బటన్లో వచ్చేలా చేయగలను --వైజాసత్య (చర్చ) 03:44, 8 డిసెంబరు 2014 (UTC)
- సాధారణంగా పూర్వులైన పండితులు రిఫరెన్సులు ఇచ్చే విధానం చూ.ఫలానా గ్రంథం, ఫలానా కాండ, 21 పద్యం అని వుంటుంది.
- కవి పేరు.
- గ్రంథం పేరు వ్రాసే వీలు ఉండాలి.
- విభాగం పేరు నిర్ధారించేందుకు వీలు ఉండాలి. ఉదా: కాండం, స్కంధం, అంకం, పర్వం వగైరా.
- వేరే ఆప్షన్‌లో విభాగం అంకె వేసుకునేందుకు వీలివ్వాలి ఉదా: 1, 2, 3 లేదా ప్రథమ, ద్వితీయ, తృతీయ తదితరాలు లేదూ అరణ్య, అజ్ఞాత, కిష్కింధ, సభా.
- ఆపైన ఉపవిభాగం కూడా ఉంటే అదీ నిర్ధారించే అవకాశం ఇవ్వాలి ఉదా: రామాయణ కల్పవృక్షంనో ఖండాలు అనేవి కాండలకు ఉపవిభాగాలుగా ఉంటాయి.
- తదనంతరం వీటి ఉపవిభాగాన్ని నిర్ధారించే వీలు ఇవ్వాలి ఉదా:ఇష్టి, కళ్యాణ, తదితరాలు.
- చివరగా పద్యం సంఖ్య.
- మధ్యలో పద్యం పేరు కూడా ఇచ్చే వీలు.
ఇవన్నీ కలిస్తే వచ్చేది ఇలా ఉండొచ్చు: విశ్వనాథ, సత్యనారాయణ. రామాయణ కల్పవృక్షము, బాలకాండము:ఇష్టిఖండము 36వ పద్యం. లేదా పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము:రుక్మిణీ కళ్యాణ ఘట్టం 43 పద్యం.--పవన్ సంతోష్ (చర్చ) 07:49, 9 డిసెంబరు 2014 (UTC)