మేడసాని మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడసాని మోహన్
జననంమేడసాని మోహన్
1955, ఏప్రిల్ 19
చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం నడింపల్లె గ్రామం
వృత్తిడైరెక్టర్ అన్నమాచార్య ప్రాజెక్టు
ఉద్యోగంతిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి
ప్రసిద్ధిఅవధాని, కవి, పండితుడు
మతంహిందూ
భార్య / భర్తఅరుణజ్యోతి
పిల్లలుశివతేజ, హిమబాల
తండ్రిమేడసాని అయ్యన్న నాయుడు
తల్లిలక్ష్మమ్మ
వెబ్‌సైటు
http://www.medasanimohan.com/

డా. మేడసాని మోహన్ (జ. ఏప్రిల్ 19, 1955) ప్రముఖ అవధాని. సుమారు 600 పైగా అష్టావధానాలు చేశాడు. సహస్రావధానం, పంచ సహస్రావధానం కూడా చేసిన ఘనత ఈయనది. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, నడింపల్లి గ్రామం. తల్లిదండ్రులు అయ్యన్న నాయుడు, లక్ష్మమ్మ. ఎనిమిదో తరగతి నుంచే ఆయనకు తెలుగు, సంస్క్రత సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. శివానంద మౌని అనే అవధూత ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు. విద్యార్థి దశ నుంచి యోగా సాధన చేసి జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకున్నాడు. పదిహేనేళ్ళ వయసులో అవధానం చేసి పండితులచే ప్రశంసలందుకున్నాడు. 1978 లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ పట్టా అందుకున్నారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసి పీ.హెచ్.డీ పట్టా పొందాడు. [1]

పదవులు[మార్చు]

తి.తి.దే నిర్వహిస్తున్న అన్నమాచార్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు, శ్రీమద్భగవద్గీత ప్రాజెక్టులకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నాడు. అహోబిలం మఠం ఆస్థాన పండితునిగా వ్యవహరిస్తున్నాడు. [2]

బిరుదులు[మార్చు]

బిరుదు ప్రధానం చేసింది
బాలావధాని శ్రీనివాసమంగాపురం లోని శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ప్రొఫెసర్ కోటేశ్వరావు చేతుల మీదుగా
సహజావధాని బీసెంట్ థియసోఫికల్ కళాశాల, మదనపల్లె, దివాకర్ల వేంకటావధాని చేతులమీదుగా
అవధాన రత్న ఆంధ్ర భాషాభి వర్ధిని, మద్రాసు, రంగభాష్యం ఐ.ఏ.ఎస్ చేతుల మీదుగా
అవధాన కేసరి రోటరీ క్లబ్ ఆఫ్ మదనపల్లి
అవధాన సరస్వతి నెల్లూరు సాహితీ సమితి
అవధాన చక్రవర్తి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి
శతావధాన సార్వభౌమ రసభారతి విజయవాడ
శతావధాన కీర్తి కౌముది కౌముది పరిషత్, విజయనగరం
అవధాన కళా తపస్వి సౌజన్య అకడామీ, కాకినాడ
అవధాన కళాధర నటసమాఖ్య, వెంకటగిరి
వాగ్ధేవి వరపుత్ర లలితా కళా పరిషత్, అనంతపురం
సరస్వతి సత్పుత్ర మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం
ఆచార్య తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్లీవ్ లాండ్, అమెరికా
అవధాన జగదేక సామ్రాట్ కవిసింహ కాశీపతి పీఠం, మాచర్ల
కవితా గంగోత్రి మైసూరు శ్రీ దత్త పీఠం, కర్ణాటక
విశ్వావధాని బాంబే తెలుగు అసోసియేషన్
ధారణా కళానిధి ఇంటర్నేషనల్ అకల్ట్ అకాడమీ
అవధాన కృషిపండిట్ ఏ.జీ. పల్లి సాహితీ ప్రేమికులు, చిత్తూరు జిల్లా
సరసావధాన సరస్వతి ఆంధ్ర గీర్వాణ పీఠం, కొవ్వూరు
సహస్రావధాన బ్రహ్మ శ్రీ వేంకటేశ్వర రసజ్ఞ సమాఖ్య
మహాసహస్రావధాన స్థాపనాచార్య పరకాల మఠం, మైసూరు
అవధాన కవితా పితామహ సిద్ధార్థ కళాపీఠం, విజయవాడ
అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ రసమయి, హైదరాబాదు

మూలాలు[మార్చు]

  1. Medasani, Mohan. "own website". medasanimohan.com. Self. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 15 April 2016. Check date values in: |archive-date= (help)
  2. Kotha, Kamalakaram. "Kammavelugu website". kammavelugu.blogspot.in. Kotha Kamalakaram. Retrieved 15 April 2016.