మేలుకొలుపు (1978 సినిమా)
Jump to navigation
Jump to search
మేలుకొలుపు (1978 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
తారాగణం | నందమూరి తారక రామారావు , కె.ఆర్.విజయ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ భాస్కర చిత్ర |
భాష | తెలుగు |
మేలుకొలుపు నందమూరి తారకరామారావు కథానాయకుడిగా 1978లో విడుదలైన తెలుగు సినిమా.
సంక్షిప్త కథ[మార్చు]
రాము అనే బాలుడు తన అక్కను బ్రతికించుకోవడానికి పెద్ద డాక్టరు వద్దకు వెళతాడు. డబ్బు లేనిదే వైద్యం చేయనంటాడు ఆ డాక్టర్. నిరాశతో ఇంటికి తిరిగివచ్చిన రాముకు అక్క శవం ఎదురౌతుంది. దానితో రాము సమాజంపై తిరగబడతాడు. పైకి మహాత్ముని అనుచరుడినని చెప్పుకుంటూ రహస్యంగా చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేసే దయానిధి రామును చేరదీస్తాడు. దొంగతనాలకు అలవాటు పడిపోయిన రామును ఇన్‌స్పెక్టర్ శేఖర్ అరెస్ట్ చేస్తాడు. అతడిని బాల నేరస్థుల శిక్షణ సంస్థకు పంంపిస్తాడు. అక్కడ ప్రిన్సిపాల్ శాంతి రాములో మానసిక పరివర్తన తేవడానికి ప్రయత్నిస్తుంది[1].
నటీనటులు[మార్చు]
- నందమూరి తారక రామారావు - ఇన్‌స్పెక్టర్ శేఖర్
- జయప్రద - శేఖర్ ప్రియురాలు
- కె.ఆర్.విజయ - శాంతి
- మాస్టర్ జయకృష్ణ - రాము
- నాగభూషణం - దయానిధి
- ప్రభాకర్‌రెడ్డి - దయానిధి అనుచరుడు
- చలం
- పద్మనాభం
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం : బి.వి.ప్రసాద్
- పాటలు : సి.నారాయణరెడ్డి, దాశరథి
- సంగీతం : మాస్టర్ వేణు
పాటలు[మార్చు]
- ఎందరో మహానుభావులు అందరికి వందానాలు - పి. సుశీల - రచన: డా. సినారె
- కనరాని నీవే కనిపించి నావే అనురాగ వీణ పలికించి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
- చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి బృందం - డా. సినారె
- చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి, వసంత బృందం - డా. సినారె
- డియ్యాలో డియ్యాలో డియ్యాలో అహ పంతులు - వసంత బృందం - రచన: దాశరధి
- పలికే మువ్వలలో తెలుపలేని కధలెన్నోతీయని నవ్వులలో - పి. సుశీల - డా. సినారె
మూలాలు[మార్చు]
- ↑ వెంకట్రావ్ (19 January 1978). "చిత్రసమీక్ష మేలుకొలుపు". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 64, సంచిక 285). Retrieved 6 January 2018.