మోకా శ్రీవిష్ణుప్రసాదరావు
మోకా శ్రీవిష్ణు ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు, చెన్నారెడ్డి కెబినెట్ లో మార్కెటింగ్ గిడ్డంగులు శాఖ మంత్రి. అతను కోనసీమ దళితుల నాయకుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]మోకా శ్రీవిష్ణుప్రసాదరావు 1930 అక్టోబరు 28 తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన.లో జన్మించాడు. అతను అంబేద్కర్ సభల్లో పాల్గొన్నాడు. అతను కాట్రేనికోన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 18 ఏళ్ళు పనిచేశాడు. 1972 సంవత్సరంలో అల్లవరం,[2] 1978లో ముమ్మిడివరం ఎమ్మెల్యే అయ్యాడు.[3] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి కెబినెట్ లో మార్కెటింగ్ గిడ్డంగులు శాఖ మంత్రిగా పని చేసాడు.
అతను ఇంటి వద్దనే నిరాడంబర జీవితం గడిపి 2020 డిసెంబరు 27న అనారోగ్యంతో మృతి చెందాడు. మంత్రిగా పని చేసినా సొంత స్కూటర్ పైనే తిరిగేవాడు. బడుగు, బలహీన వర్గాలకు అధిక సంఖ్యలో ఇండ్ల స్థలములు, పట్టాలు ఇప్పించాడు. ముమ్మిడివరంలో గవర్నమెంట్ ఆసుపత్రి, కోర్టు రావటానికి ,మురముళ్ల రాఘవేంద్ర వారధి నిర్మాణం జరగటానికి క్రుషి చేసాడు. దామోదరం సంజీవయ్య అమలాపురం వచ్చినపుడు కాట్రేనికోన సర్పంచ్ గా ఉన్న విష్ణు ప్రసాద్ రావు కోనసీమ లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనకు వివరించాడు. అతనికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.
మూలాలు
[మార్చు]- ↑ "ఏపీలో విషాదం: మాజీ మంత్రి కన్నుమూత.. సర్పంచ్ నుంచి కేబినెట్ స్థాయికి!". Samayam Telugu. Retrieved 2021-10-23.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2021-10-23.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1978". Elections in India. Archived from the original on 2019-12-10. Retrieved 2021-10-23.