Jump to content

మోనిషా ఉన్ని

వికీపీడియా నుండి
మోనిషా ఉన్ని
జననంజనవరి 24, 1970
పన్నియంకర, కోజికోడ్, కేరళ, భారతదేశం
మరణం1992 డిసెంబరు 5(1992-12-05) (వయసు 22)
ఎక్స్-రే జంక్షన్, చేర్తల, అలప్పుజా
విద్యాసంస్థమౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు
వృత్తినటి
క్లాసికల్ డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు1984–1992
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నఖక్షతంగల్
పెరుంథాచన్
కమలదళం
తల్లిదండ్రులునారాయణన్ ఉన్ని
శ్రీదేవి ఉన్ని

మోనిషా ఉన్ని (1970 జనవరి 24 - 1992 డిసెంబరు 5) భారతీయ నటి. మలయాళం, తమిళ సినిమాలతో ఆమె ప్రసిద్ధి చెందింది.[1]

తన తొలి చలనచిత్రం నఖక్షతంగల్ (1986)తోనే ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపుపొందింది.[2] అప్పుడు ఆమెకు 16 సంవత్సరాలు.

శారద, శోభన, మీరా జాస్మిన్, సురభి లక్ష్మి, శోభలతో పాటు, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఆరుగురు మలయాళ నటీమణులలో మోనిషా ఉన్ని ఒకరు కావడం విశేషం.[3][4]

ఆమె తక్కువ సమయంలోనే ఎం. టి. వాసుదేవన్ నాయర్, హరిహరన్, ప్రియదర్శన్, అజయన్, కమల్, సిబి మలైల్ వంటి దర్శకులతో కలిసి పనిచేసింది.[5]

మోహినియాట్టం నృత్యంలో శిక్షణ పొందిన ఆమె 1985లో కర్ణాటక రాష్ట్ర స్థాయి నృత్య పోటీల్లో కౌశిక్ అవార్డు గెలుచుకుంది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

మోనిషా ఉన్ని కోజికోడ్‌లోని పన్నియంకరలో నారాయణన్ ఉన్ని, శ్రీదేవి ఉన్ని దంపతులకు 1971లో జన్మించింది.[6] ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి సినిమానటి, నర్తకి. ఆమెకు సజిత్ ఉన్ని అనే అన్నయ్య ఉన్నాడు.[7]

ఆమె బెంగుళూరులోని సెయింట్ చార్లెస్ హై స్కూల్, బిషప్ కాటన్ బాలికల పాఠశాలల్లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆమె బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పట్టాపుచ్చుకుంది.[8]

కెరీర్

[మార్చు]

మలయాళ నవలా రచయిత, స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు కూడా అయిన ఎం. టి. వాసుదేవన్ నాయర్, మోనిషా కుటుంబ స్నేహితుడు. దీంతో ఆమె సినిమాల్లోకి రావడానికి కారణం అయ్యడు. ఆమె తొలిసారిగా ఎం. టి. వాసుదేవన్ నాయర్ రచించిన నఖక్షతంగల్ (1986) చిత్రంలో నటించింది. ఈ చిత్రం ముగ్గురు యువకులతో కూడిన ట్రయాంగిల్ ప్రేమకథ కాగా హరిహరన్ దర్శకత్వం వహించాడు. మోనిషా ఉన్ని చిత్ర కథానాయిక గౌరీ పాత్రలో ఒదగి నటించిన తీరుకు 1987లో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.[8] ఇది తమిళంలోకి పూక్కల్ విదుం తూత్తుగా రీమేక్ చేయబడింది.

మరణం

[మార్చు]

మోనిషా ఉన్ని మలయాళ చిత్రం చెప్పడివిద్య షూటింగ్ లో ఉండగా కారు ప్రమాదంలో మరణించింది. 1992 డిసెంబరు 5న మోనిషా ఉన్ని, ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని ప్రయాణిస్తున్న కారు అలప్పుజ్హలోని చేరాల సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆమె తల్లి గాయాలతో బయటపడగా, మోనిషా ఉన్ని చికిత్స పొందుతూ మరణించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "വീണ്ടും ഞാന്‍ തനിച്ചായി | mangalam.com". Archived from the original on 3 December 2013. Retrieved 29 November 2013.
  2. "Remembering actress Monisha Unni on her 29th death anniversary". The Times of India (in ఇంగ్లీష్). 2021-12-05. Retrieved 2022-12-05.
  3. 3.0 3.1 "Losing her wish, she turned to dance – the Hindu". The Hindu. Archived from the original on 30 November 2013. Retrieved 18 November 2013.
  4. "Remembering Monisha Unni – the Hindu". The Hindu. Archived from the original on 15 April 2014. Retrieved 14 April 2014.
  5. "Manorama Online | Movies | Nostalgia |". Archived from the original on 3 December 2013. Retrieved 26 November 2013.
  6. "Remembering 'Manjal Prasadam Nettiyil Charthiya' girl Monisha Unni on her death anniversary – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2019. Retrieved 2020-05-07.
  7. "മോനിഷയുടെ കഥ | mangalam.com". Archived from the original on 5 December 2013. Retrieved 28 December 2013.
  8. 8.0 8.1 Weblokam Profile of Monisha Archived 2 ఏప్రిల్ 2007 at the Wayback Machine. Weblokam.com. Retrieved on 2012-11-20.