Jump to content

యశస్వి (కవి)

వికీపీడియా నుండి
(యర్రంశెట్టి యశస్వి నుండి దారిమార్పు చెందింది)
యర్రంశెట్టి యశస్వి
జననంయర్రంశెట్టి సతీష్‌కుమార్
(1975-09-01) 1975 సెప్టెంబరు 1 (వయసు 49)
నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
వృత్తికవి, ఈనాడు టెలివిజన్ లో మానవ వనరుల విభాగానికి మేనేజర్
ఉద్యోగంఈనాడు
ఎత్తు5.75'
బరువు81
మతంహిందూ
భార్య / భర్తశైలజారాణి
పిల్లలుశ్రీ యశస్వి
తండ్రిరామారావు
తల్లిగిరిజావతి
వెబ్‌సైటు
www.blaagu.com/sateesh

యశస్విగా తెలుగు కవిత్వ ప్రేమికులకు పరిచితులైన వీరి అసలు పేరు సతీష్ కుమార్. యశస్వి వీరి కలంపేరు. కవిసంగమం గ్రూప్ ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా వీరూ, వీరి కవిత్వమూ ప్రాచుర్యం పొందాయి

జననం

[మార్చు]

యశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు 1975 సెప్టెంబర్ 1పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జన్మించాడు . అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) బెంగళురులో ఉంటున్నాడు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

[మార్చు]

హైదరాబాదు లోని దిల్‍సుఖ్ నగర్ చైతన్యపురి, జైన్ మందిర్ దగ్గర నివసిస్తున్నారు. ఈనాడు టెలివిజన్ వార్తా చానెల్లో (మానవ వనరుల విభాగం, కార్య నిర్వహణ) మేనేజరుగా పనిచేసేవారు. ప్రస్తుతం ఫ్రీ లాన్సర్.

విద్యార్హతలు

[మార్చు]
  • మే 1998లో స్నాతకోత్తర పట్టా; ఎంబిఎ. ఆంధ్ర విశ్వవిద్యాలయం
  • మే, 1996 లో B.Sc.. తణుకు ప్రభుత్వ కళాశాల
  • సెప్టెంబర్ 1992 లో రాష్ట్ర భాషాప్రవీణ, దక్షిణ భారత హిందీ ప్రచారసభ.

ఇతర విద్యార్హతలు

  • Diploma in Online Journalism by International Institute of Journalism, In association with INWENT (capacity building international, by Germany )
  • Pro in Multimedia and Web design Specialist, ZED CA, ZILS, (Essel Group, Mumbai)

భార్య - పిల్లలు

[మార్చు]

శైలజారాణి - శ్రీ యశస్వి

రచనలు

[మార్చు]

మొదటి కవిత అక్షరాన్ని.. నేనక్క్షరాన్ని, ఈనాడు తెలుగు-వెలుగు ప్రారంభ సంచిక సెప్టెంబర్ 2012 లో ప్రచురితం అయింది. మలి కవితాముద్రణ: తానా సావనీర్ 2013లో, బహుమతి పొందిన కవిత "కొత్తమనిషీ! రాయిలా" సిలికానంధ్రా సుజనరంజని వెబ్ పత్రికలో ..

పుస్తకాలు

[మార్చు]
  1. తెల్లకాగితం (56 కవితల సంపుటి), ప్రచురుణ: 20.12.2012.
  2. ఒక్కమాట (150 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు""), ప్రచురుణ: 11.12.2013.
  3. వేలికొసన.. (66 కవితల సంపుటి), ప్రచురుణ: 20.08.2016.
  • VELIKOSANA YASASWI.pdf [1] ఇక్కడ చదువుకోవచ్చు
  1. రెండుమాటలు (114 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు"") అముద్రితం

కవితత్వాలు

[మార్చు]

యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను 2013 డిసెంబరులో సంకలనంగా తెచ్చారు.[1] నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, కవి యాకూబ్, రాళ్లబండి కవితాప్రసాద్, తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, శిలాలోలిత, స్కైబాబ, వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.

మలి ప్రయత్నంగా ఒక్కమాట కవితత్వాలకు కొనసాగింపుగా #రెండుమాటలు పేర మరో 150 మంది మీద కవితత్వాలు రాస్తున్నారు.

వృత్తిగత అనుభవం

[మార్చు]
  • ఈనాడు జర్నలిజం స్కూలులో 13సంవత్సరాల నుంచి కార్యనిర్వాహకునిగా ఉపనియామకం. (రామోజీ గ్రూపు ఈటీవి వార్తా ఛానళ్ల మానవవనరుల విభాగంలో మేనేజరు )

నిర్వహించిన విధులు

[మార్చు]
  • జర్నలిజం స్కూలు నిర్వహించే పత్రిక, టీవీ, వెబ్ మాధ్యమాల పి.జి డిప్లొమా కోర్సు కార్యనిర్వహణ.
  • నోటిఫికేషను, రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహణ, బృందచర్చ, ముఖాముఖీ ఎంపికల ఏర్పాట్లలో భూమిక, ఎంపికైన అభ్యర్థుల శిక్షణలో భాగంగా విధివిధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ.
  • శిక్షణార్థుల, సమన్వయకర్తల, బోధకుల సంధాత, సాంకేతిక సహాయకారి, సంక్షేమ అధికారి.

ప్రగతి నిర్థారకాలు

[మార్చు]
  • వందల మంది పాత్రికేయుల తయారీలో, శిక్షణలో, వ్యక్తిత్వ వికాసంలో భాగస్వామ్యం,
  • రామోజీ గ్రూపులోని అనుబంధ సంస్థల నిర్వహణ, ఏర్పాట్లలోనూ అనుభవం.

వృత్తి గతానుభవం

[మార్చు]
  • ICFAI విశ్వవిద్యాలయంలో కార్యనిర్వాహక హోదాలో 2002 ఫిబ్రవరి నుంచి 2005 సెప్టెంబర్ వరకు
  • వేరు –వేరు విధుల్లో పలు శిక్షణ, సాంకేతిక విద్యాసంస్థల్లో పనిచేశారు.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

[మార్చు]

బహుమానాలు

  1. 2013లో సిలికానాంధ్ర నిర్వహించిన విజయ నామ ఉగాది కవితా పొటీల్లో ద్వితీయ బహుమతి.

బిరుదులు

  1. కవిసంగమం కవుల కవి గాగుర్తింపు
  2. ఫేస్ బుక్ కవి సంగమం సమూహం అడ్మిన్, సమూహం సభ్యులు
  3. 2014లో హైదరాబాద్ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ఆహ్వానం పై కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.

వ్యాపకాలు

[మార్చు]
  • సాహిత్యపఠనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,ఫేస్.బుక్ కవిసంగమం గ్రూపు నిర్వహణ
  • జీవితం పై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నంలో అనుభూతులను కవిత్వీకరించడం.
  • తెలుగుయూనికోడ్ ఫాంట్ల సహాయంతో పుస్తకాల రూపకల్పన.

‘తెల్లకాగితం’, ‘ఒక్కమాట’, వేలికొసన.. పుస్తకాలిలా రూపొందినవే

మిత్రులు, సహకవులు "వర్చస్వి" లోకాస్సమస్తా కవిత్వసంపుటి; ఎన్ వి యం వర్మ కలిదిండి రచించిన నేనుమాత్రం ఇద్దరిని కవిత్వసంపుటి తెలుగుయూనికోడ్ ఫాంట్ల సహాయంతో వీరి ప్రమేయంతో రూపొందించినవే.

ఇతర లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం". Archived from the original on 2014-01-24. Retrieved 2014-05-20.