యశ్వంత్ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Yashwant Sinha
యశ్వంత్ సిన్హా


పదవీ కాలము
1 July 2002 – 22 May 2004
ప్రధాన మంత్రి Atal Bihari Vajpayee
ముందు Jaswant Singh
తరువాత Natwar Singh

వ్యక్తిగత వివరాలు

జననం (1937-09-06) 1937 సెప్టెంబరు 6 (వయస్సు: 82  సంవత్సరాలు)
Patna, Bihar, British India
రాజకీయ పార్టీ Bharatiya Janata Party

యశ్వంత్ సిన్హా (1937 నవంబరు 6న, పాట్నా[1]లో జన్మించారు) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి (ప్రధానమంత్రి చంద్రశేఖర్ మంత్రిత్వశాఖలో 1990–1991 వరకూ మరియు 1998 – జూలై 2002 వరకూ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వద్ద ఉన్నారు) [2] మరియు విదేశీమంత్రిగా (జూలై 2002 – మే 2004) [3] అటల్ బిహారీ వాజ్‌పేయి యొక్క మంత్రిత్వశాఖలో ఉన్నారు. ఆయన, భారతదేశంలో ప్రస్తుతం అధికార౦లో ఉన భాజపాలో సీనియర్ నాయకుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

పాట్నా, బీహార్‌లో జన్మించిన సిన్హా అక్కడే విద్యాభ్యాసం చేశాడు. 1958 లో రాజకీయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[1] తదనంతరం, ఆయన ఆ పాఠ్యాంశాన్ని పాట్నా విశ్వవిద్యాలయంలో 1960 వరకూ బోధించారు. 2009 సాధారణ ఎన్నికలలో ఓటమిపాలయిన తరువాత పార్టీ చర్యపై అసంతృప్తిని చెంది భా.జ.పా ఉపాధ్యక్షుడి స్థానానికి రాజీనామా చేశాడు.

పరిపాలనా శాఖోద్యోగి వృత్తి[మార్చు]

యశ్వంత్ సిన్హా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను 1960లో చేరారు మరియు దాదాపు 24 సంవత్సరాలు ఆయన వృత్తి జీవితంలో ముఖ్యమైన స్థానాలను పోషించారు. ఆయన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌గా మరియు 4 సంవత్సరాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. సహాయ కార్యదర్శి మరియు ఉప కార్యదర్శిగా బీహార్ ప్రభుత్వం యొక్క ఆర్థికశాఖలో 2 సంవత్సరాలు ఉన్నారు, దాని తరువాత వాణిజ్య మంత్రిత్వశాఖలో భారత ప్రభుత్వానికి ఉప కార్యదర్శిగా ఉన్నారు.

1971 నుండి 1973 వరకూ, బాన్, జర్మనీలో భారత రాయబార కార్యాలయంలో మొదటి కార్యదర్శి (వాణిజ్య) గా ఉన్నారు. తదనంతరం, ఆయన ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1973 నుండి 1974 వరకూ కౌన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఈ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసిన తరువాత, విదేశీ వాణిజ్యం మరియు యురోపియన్ ఆర్థిక సమాజంతో భారతదేశానికి ఉన్న సంబంధాలకు సంబంధించిన అంశాలలో అనుభవాన్ని గడించారు. దాని తరువాత, ఆయన బీహార్ ప్రభుత్వంలోని పారిశ్రామిక అవస్థాపన శాఖలో మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖలో, విదేశీ పరిశ్రమల తోడ్పాటులు, సాంకేతికత దిగుమతులు, మేధోసంపత్తి హక్కులు మరియు పరిశ్రమల అనుమతులకు భారత ప్రభుత్వం చేసిన లావాదేవీలలో పనిచేశారు. సంయుక్త కార్యదర్శిగా భారత ప్రభుత్వంలోని ఉపరితల రవాణా మంత్రిత్వశాఖలో 1980 నుండి 1984 వరకూ పనిచేశారు, ఆయన ముఖ్య బాధ్యతలలో రహదారుల రవాణా, ఓడరేవులు మరియు ఓడ ప్రయాణాలు ఉన్నాయి.

రాజకీయ జీవితం[మార్చు]

జనతాదళ్[మార్చు]

యశ్వంత్ సిన్హా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు 1984లో రాజీనామా చేశారు మరియు జనతాపార్టీ సభ్యుడిగా చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నారు. ఆయన పార్టీ యొక్క ఆల్-ఇండియా జనరల్ సెక్రటరీగా 1986లో నియమించబడినారు మరియు రాజ్యసభ (భారత పార్లమెంటు యొక్క ఎగువసభ) సభ్యులుగా 1988లో ఎన్నుకోబడినారు.

జనతాదళ్ 1989లో ఏర్పడినప్పుడు, ఈయన పార్టీ యొక్క జనరల్ సెక్రటరీగా నియమింపబడినారు. ఆయన చంద్రశేఖర్ మంత్రిత్వశాఖలో ఆర్థికమంత్రిగా నవంబరు, 1990 నుండి జూన్ 1991 వరకూ ఉన్నారు.

BJP[మార్చు]

ఆయన జూన్ 1996లో భారతీయ జనతాపార్టీ యొక్క జాతీయ ప్రతినిధిగా అయ్యారు. మార్చి 1998లో ఆర్థికమంత్రిగా నియమించబడినారు. ఆ తేదీ నుండి 2004 మే 22 వరకూ విదేశీమంత్రిగా ఉన్నారు, పార్లమెంటరీ ఎన్నికలు అయిన తరువాత నూతన ప్రభుత్వం అధికారాన్ని స్వీకరించింది. ఆయన బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్) లోని హజారిబాగ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేశారు (భారత పార్లమెంట్ యొక్క దిగువ సభ). అయినప్పటికీ, అనుకోనివిధంగా, యశ్వంత్ సిన్హాను 2004లో జరిగిన ఎన్నికలలో హజారిబాగ్ స్థానం నుండి ఓడించబడింది. ఆయన తిరిగి పార్లమెంటులోకి 2005లో ప్రవేశించారు. 2009 జూన్ 13న, ఆయన BJP వైస్ ప్రెసిడెంట్ స్థానానికి రాజీనామా చేశారు.[4]

ఆర్థికమంత్రి[మార్చు]

2008 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఈస్ట్ ఆసియాలో ప్రసంగిస్తున్న సిన్హా

యశ్వంత్ సిన్హా ఆర్థికమంత్రిగా 2002 జూలై 1 వరకు ఉన్నారు, అప్పుడు ఆయన విదేశీమంత్రి జస్వంత్ సింగ్‌తో స్థానాలను బదిలీ చేసుకున్నారు. సిన్హా ఆయన పదవీకాలంలో, తన ప్రభుత్వం యొక్క ముఖ్య విధాన ప్రోత్సాహకాల ప్రాముఖ్యతను బలవంతానికి గురయ్యి తగ్గించటం వలన తీవ్రంగా విమర్శించబడినారు[1]. అంతేకాకుండా, భారత ఆర్థికవ్యవస్థను స్థిరమైన అభివృద్ధి మార్గంలో ఉంచిన అతిపెద్ద సంస్కరణలను ప్రతిపాదించినందుకు సిన్హ అభినందనలను పొందారు. వడ్డీ రేట్లను తగ్గించటం, తనఖా వడ్డీ కొరకు పన్ను మినహాయింపును ప్రవేశపెట్టటం, టెలి కమ్యూనికేషన్స్ రంగాన్ని స్వేచ్ఛాయుతం చేయటం, నేషనల్ హైవేస్ అథారిటీకి సహాయక నిధి, మరియు పెట్రోలియం పరిశ్రమ మీద నియంత్రణను ఎత్తివేయటం వీటిలో ఉన్నాయి. భారత బడ్జట్‌ను స్థానిక సమయం అయిన సాయంత్రం 5 గంటలకు ప్రవేశ పెట్టే 53 ఏళ్ళ ఆచారాన్ని మార్చిన మొదటి ఆర్థికమంత్రిగా సిన్హా అయ్యారు, ఈ పద్ధతిని బ్రిటీష్ పరిపాలనా రోజుల నుండి ఉంది, ఈ సమయం భారత పార్లమెంట్ కన్నా బ్రిటీష్ పార్లమెంటుకు (1130a GMT) అనుకూలంగా ఉంది.

సిన్హా ఆర్థికమంత్రిగా ఆయన పనిచేసిన సంవత్సరాల గురించి విపులంగా వ్రాశారు, దాని పేరు "'కన్ఫెషన్స్ ఆఫ్ అ స్వదేశీ రిఫార్మర్'" అని ఉంది.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

యశ్వంత్ సిన్హా అనేక రకాలైన అభిరుచులను కలిగి ఉన్నారు, అందులో అధ్యయనం, తోటపని మరియు ప్రజలను కలవటం ఉన్నాయి. ఆయన విస్తారంగా ప్రయాణించారు మరియు అనేకమైన రాజకీయ మరియు సాంఘిక ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహించారు. ఆయన దేశం తరుపున అనేక లావాదేవీలలో ప్రధాన పాత్రను పోషించారు.

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 "Yashwant Sinha, a profile:Finance Minister, Government of India". మూలం నుండి 2007-09-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-30. Cite web requires |website= (help)
  2. "Yashwant Sinha gets finance, Advani home (Indian Express)". Retrieved 2007-09-30. Cite web requires |website= (help)
  3. "Indian government reshuffled". BBC News. 2002-07-01. Retrieved 2007-09-30.
  4. యశ్వంత్ సిన్హా, BJP మాజీ ప్రెసిడెంట్ పదవిని విడిచిపెట్టారు
  5. Confessions of a Swadeshi reformer at publisher site. Retrieved 2008-11-04.