భారత రాష్ట్రపతి ఎన్నికలు 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు 2022లో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలో దేశ 16వ భారత రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు.

రాష్ట్రపతి పదవికి అర్హత[మార్చు]

రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం పోటీ చేసే అభ్యర్థులకు ఈ కింద అర్హతలుండాలి.

  • 35సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి.
  • లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హతలుండాలి.
  • కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉండకూడదు.[1][2]

నామినేషన్ విధానం[మార్చు]

రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని 50మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. ఆ తర్వాత 50మంది ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించి డిపాజిట్ కింద రూ.15వేలు కట్టాలి.

ఎన్నికల షెడ్యూల్[మార్చు]

రాష్ట్రపతి ఎన్నికకు 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ ‎కుమార్ షెడ్యూల్ ప్రకటించాడు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎన్నికల కమిషనర్ తెలిపాడు.[3]

సంఖ్య ఎన్నికల ప్రకియ తేదీ వారం
1. ఎన్నికకు నోటిఫికేషన్ 2022 జూన్ 15 బుధవారం
2. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 2022 జూన్ 29 బుధవారం
3. నామినేషన్ల పరిశీలన 2022 జూన్ 30 గురువారం
4. నామినేషన్ల ఉపసంహ‍రణకు చివరి తేదీ 2022 జులై 2 శనివారం
5. ఎన్నిక 2022 జూలై 18 సోమవారం
6. కౌంటింగ్ 2022 July 21 గురువారం

ఎన్నిక విధానం[మార్చు]

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల ఎంపీలు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ, రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదని, శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరని ఈసీ తెలిపింది. ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్‌లో ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.[4]

మూలాలు[మార్చు]

  1. NTV (9 June 2022). "రాష్ట్రపతిగా ఎన్నికవ్వాలంటే ఎంత మంది మద్దతు అవసరం?". Archived from the original on 10 జూన్ 2022. Retrieved 10 June 2022.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (9 June 2022). "రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎవ‌రైనా పోటీ చేయొచ్చా? ఎన్నిక‌ ప్రక్రియ ఎలా జరుగుతుంది ?". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. Sakshi (9 June 2022). "రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  4. "రాష్ట్రపతి ఎన్నికలో విశేషాలెన్నో". 10 June 2022. Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.