1977 భారత రాష్ట్రపతి ఎన్నికలు
| |||||||||||||||||
| |||||||||||||||||
|
భారత ఎన్నికల సంఘం 1977 ఆగస్టు 6న ఏడవ భారత రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. భారత రాష్ట్రపతి ఎన్నికలకు 37 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు, వారిలో 36 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి , దీనితో నీలం సంజీవ రెడ్డి పోటీలో ఒక్కడే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]
నేపథ్యం
[మార్చు]భారత రాష్ట్రపతిగా ఉన్న, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, మరణించడంతో, [2] [3] భారత ఉపరాష్ట్రపతి బి.డి. జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. [4] రాష్ట్రపతి పదవికి ఎన్నికను ఖాళీ అయిన తేదీ నుండి 6 నెలల్లోపు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలి.
ఎలక్టోరల్ కాలేజీ లోక్‌సభ (524), రాజ్యసభ (232) 22 రాష్ట్ర శాసనసభల (3776) సభ్యులను కలిగి ఉంది, మొత్తం 4532 మంది ఓటర్లు ఉన్నారు. [4]
ఎన్నికల షెడ్యూలు
[మార్చు]భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1977 జులై 4న ప్రకటించింది [4]
స.నెం. | పోలింగ్ కార్యక్రమాలు | తేదీ |
---|---|---|
1. | నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 1977 జులై 18 |
2. | నామినేషన్ పరిశీలన తేదీ | 1977 జులై 19 |
3. | నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 1977 జులై 21 |
4. | పోలింగ్ తేదీ | 1977 ఆగస్టు 6 |
5. | కౌంటింగ్ తేదీ | నీలం సంజీవరెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కౌంటింగ్ జరగలేదు. |
మూలాలు
[మార్చు]- ↑ http://164.100.47.5/presidentelection/7th.pdf Archived 2016-03-03 at the Wayback Machine Election Commission of India
- ↑ "Fakhruddin Ali Ahmed: 1905-1977 - OBITUARY". 28 February 1977. Retrieved 30 January 2022.
- ↑ "Shri Fakhruddin Ali Ahmed - Past President of India". Retrieved 30 January 2022.
- ↑ 4.0 4.1 4.2 "Background material related to Election to the office of President of India 2017". Election Commission of India. Retrieved 30 January 2022.