భారత ఎన్నికల సంఘం 1982 జూలై 12న భారత రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. జైల్ సింగ్ 754,113 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి హన్స్ రాజ్ ఖన్నా పై విజయం సాధించాడు. హన్స్ రాజ్ ఖన్నా 282,685 ఓట్ల ను సాధించాడు.[1]జైల్ సింగ్ భారతదేశ మొదటి సిక్కురాష్ట్రపతిగా నిలిచాడు.
భారత రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థులలో లండన్ భారతీయ మాజీ రాయబారి ఎన్. జి. గోరే, మాజీ రాజ్యసభ సభ్యుడు భోలా పాశ్వాన్ శాస్త్రి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేశారు.[2]